త్రిష బర్త్‌డే.. విజయంతో విజయ్ ట్రీట్ ఇస్తాడా? లేక!

ABN , Publish Date - May 04 , 2026 | 09:55 AM

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒకటే చర్చ.. తమిళనాడు ఎన్నికలలో దళపతి విజయ్ గెలుస్తాడా? అని. అలాగే, ఇదే రోజు అందాల భామ త్రిష పుట్టినరోజు కూడా కావడంతో.. కోలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఫ్యాన్స్ తెగ ఎగ్జైట్ అవుతున్నారు.

Thalapathy Vijay and Trisha

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒకటే చర్చ.. తమిళనాడు ఎన్నికలలో దళపతి విజయ్ (Thalapathy Vijay) గెలుస్తాడా? అని. అలాగే, ఇదే రోజు అందాల భామ త్రిష (Trisha) పుట్టినరోజు కూడా కావడంతో.. కోలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఫ్యాన్స్ తెగ ఎగ్జైట్ అవుతూ.. అసలైన ఆట ఇప్పుడే మొదలైంది అంటూ.. తెగ హడావుడి చేస్తున్నారు. తమిళనాడులో ప్రస్తుతం ఓట్ల లెక్కింపు (Tamil Nadu Election Results) ప్రక్రియ వేగంగా సాగుతోంది. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ పార్టీ, ఊహించినట్లుగానే కౌంటింగ్‌లో దూసుకుపోతోంది. ప్రస్తుతం విజయ్ పార్టీ ముందంజలో ఉండటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.


సరిగ్గా ఇదే రోజు త్రిష బర్త్‌డే కావడం విశేషమనే చెప్పుకోవాలి. గత కొంతకాలంగా విజయ్, త్రిషల మధ్య ఏదో నడుస్తోందని, వీరిద్దరూ సన్నిహితంగా ఉంటున్నారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. వీరిద్దరూ త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారనేలా టాక్ నడుస్తూనే ఉంది. మరోవైపు విజయ్ కూడా తన భార్యకు విడాకులు ఇచ్చే ప్రక్రియలో ఉన్నారు. ఈ క్రమంలో తమిళనాట ఈ ఎన్నికలు మరింత విశిష్టతను సంతరించుకున్నాయి. TVK పార్టీ (Tamilaga Vettri Kazhagam) గెలుపు ఒకవైపు.. తనకిష్టమైన స్నేహితురాలు (ప్రియురాలు అని కూడా అనుకోవచ్చు) త్రిష పుట్టినరోజు మరోవైపు! ఈ రెట్టింపు సంతోషంలో విజయ్ ఆమెకు గ్రాండ్ ట్రీట్ ఇస్తారా! అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటి వరకు వినిపించిన రూమర్స్‌కు బలాన్ని చేకూరుస్తూ.. ఈ స్పెషల్ రోజున విజయ్ విజయంతో ఆమెకు సర్‌ప్రైజ్ ఇస్తాడా? అని నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


వీరిద్దరి రిలేషన్‌షిప్‌పై కోలీవుడ్‌లో రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. విజయంతో విజయ్ ఇచ్చే ట్రీట్ కేవలం పార్టీ వరకే పరిమితమవుతుందా? లేక వారి వ్యక్తిగత జీవితంలో కొత్త మలుపు తీసుకుంటుందా? ఈ బర్త్‌డే సాక్షిగా వీరిద్దరూ తమ బంధాన్ని నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్తారా అన్నది వేచి చూడాలి. మరోవైపు, తన పుట్టినరోజును పురస్కరించుకుని త్రిష తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. కేవలం బర్త్‌డే కాబట్టి స్వామివారి ఆశీస్సులు తీసుకోవడానికి వెళ్ళిందా? లేక తన స్నేహితుడు విజయ్ రాజకీయ విజయం కోసం ఏదైనా మొక్కు మొక్కుకుందా? అనే చర్చలు మొదలయ్యాయి. తమిళనాడు (Tamil Nadu)లో ఓట్ల లెక్కింపు జరుగుతున్న సమయంలో త్రిష శ్రీవారి చెంత ఉండటం యాదృచ్ఛికమే అయినా.. వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం రీత్యా ఈ దర్శనం వెనుక ఏదైనా బలమైన కారణం ఉండి ఉండవచ్చని నెటిజన్లు కామెంట్స్ చేస్తుండటం విశేషం. చూద్దాం.. విజయ్ ఇచ్చే సర్‌ప్రైజ్ ఎలా ఉంటుందో?

ఇవి కూడా చదవండి:

‘సన్ రైజర్స్‌’కు సపోర్ట్ చేస్తున్న ఈ భామ ఎవరో గుర్తు పట్టారా?

Varanasi: ‘వారణాసి’కి వాటర్ కొరత!.. మహేష్ సినిమాకు ప్రభుత్వం షాక్!

‘పెద్ది’తో ఫైట్‌కు మహేష్ బాబు ఓకే అంటాడా?

ఒకే వేడుకలో చైతూ-శోభిత, సమంత-రాజ్ జంటలు హల్చల్!

Updated Date - May 04 , 2026 | 09:55 AM

Vijay Thalapathy: విజయ్ పొలిటికల్ ఎంట్రీ.. శత్రువు ఎవరంటే

Thalapathy Vijay: 23 ఏళ్ల తర్వాత విడాకులు!?.. సన్నిహితుల రియాక్షన్

Thalapathy Vijay: ఏం మాట్లాడుతున్నార్రా.. 220 కోట్లు రెమ్యూనరేషన్ ఏంట్రా

Thalapathy Vijay: ద‌ళ‌ప‌తి విజయ్ ఇంటికి మ‌రో లగ్జరీ కారు

Thalapathy Vijay: ఒకే ఒక్క సిట్టింగ్‌లో.. మరో టాలీవుడ్ దర్శకుడితో విజయ్ మూవీ!