ఆడియో జ్యూక్ బాక్స్ విడుదల.. ‘పెద్ది’ టీమ్ తప్పు చేసిందా?
ABN , Publish Date - May 28 , 2026 | 09:58 PM
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన ‘పెద్ది’ మూవీ జ్యూక్ బాక్స్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఇందులో ‘మస్సా మస్సా’ సాంగ్ విన్నవారంతా.. ‘పెద్ది’ టీమ్ తప్పు చేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan), జాన్వీ కపూర్ (Janhvi Kapoor) జంటగా, క్రియేటివ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ (Peddi). ఈ మూవీ ప్రమోషన్స్‌ని మేకర్స్ ఓ రేంజ్‌లో నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన పాటలు చార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయి. ఇక మ్యూజికల్ హంగామాలో భాగంగా గురువారం ఈ సినిమాకు సంబంధించిన పూర్తి ఆడియో జ్యూక్ బాక్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ (AR Rahman) స్వరపరిచిన ఈ ఆల్బమ్, విడుదలైన కొద్ది సేపట్లోనే సోషల్ మీడియాను షేక్ చేస్తూ, దూసుకెళుతోంది. ఈ జ్యూక్ బాక్స్ విడుదల తర్వాత ‘పెద్ది’ టీమ్ పెద్ద తప్పు చేసిందంటూ అభిమానులు, నెటిజన్లు స్పందిస్తుండటం విశేషం.
ఇప్పటివరకు ఈ సినిమా నుంచి మూడు పాటలను మేకర్స్ విడివిడిగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ పాటలు ఇప్పటికే చార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయి. అయితే, ఈ ఆడియో జ్యూక్ బాక్స్‌లో అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ‘మస్సా మస్సా’ (Massa Massa) సాంగ్‌ను కూడా యాడ్ చేయడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానీ, ఈ సాంగ్‌ని కూడా విడిగా రిలీజ్ చేసి ఉంటే.. సెన్సేషన్‌ని క్రియేట్ చేసేదని, ఈజీగా 100 మిలియన్ల వ్యూస్‌ని రాబట్టేదని, సినిమాపై ఇంకా భారీగా అంచనాలను పెంచేసేదని ఫ్యాన్స్, నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. అసలీ పాటను ఇప్పటి వరకు విడుదల చేసిన మూడు పాటల కంటే ముందు రిలీజ్ చేసి ఉంటే.. ఐపీఎల్‌లో మోత మోగేదని వారంతా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిజమే, ఆ పాటలో అంత విషయం ఉంది మరి.
ఇప్పటి వరకు విడుదలైన ‘చికిరి చికిరి’, ‘రై రై రారా’, ‘హల్లల్లల్లో’తో పాటు ఇప్పుడు వచ్చిన ‘మస్సా మస్సా’ సాంగ్.. ఈ జ్యూక్ బాక్స్‌ను చాలా ప్రత్యేకంగా నిలిపింది. ఏఆర్ రెహమాన్ తనదైన సిగ్నేచర్ మ్యూజిక్, వినూత్నమైన బీట్స్‌తో ప్రతి పాటకు ప్రాణం పోశారు. ముఖ్యంగా ‘మస్సా మస్సా’ సాంగ్ అయితే విన్నవారి మైండ్ నుంచి పోవడం లేదు. రిపీటెడ్ మోడ్‌లో వినేలా రెహమాన్ ఈ పాటను కంపోజ్ చేశారు. మొత్తానికి పూర్తి ఆల్బమ్‌తో వచ్చిన ‘పెద్ది’ జ్యూక్ బాక్స్ ప్రస్తుతం యూట్యూబ్‌తో పాటు అన్ని మ్యూజిక్ ప్లాట్‌ఫార్మ్స్‌లోనూ టాప్‌లో ట్రెండింగ్ అవుతోంది.
ఇవి కూడా చదవండి:
యూపీలో పౌల్ట్రీ బిజినెస్.. భూమి పూజతోనే బండ్ల గణేష్ పరార్.. ఎందుకంటే?
‘రంగస్థలం’ చిట్టిబాబుకి, ‘పెద్ది’కి ఉన్న తేడా ఏంటంటే?
‘అమ్మ’కు ఏమైంది? మరో సీనియర్ నటి సంచలన ఆరోపణలు!