బాక్సాఫీస్ ఛాంపియన్ ‘పెద్ది’ 2 డేస్ కలెక్షన్స్ ఎంతంటే..

ABN , Publish Date - Jun 06 , 2026 | 05:45 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వచ్చిన ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. తాజాగా ఈ మూవీ రెండు రోజులకు గానూ రాబట్టిన కలెక్షన్స్ వివరాలతో మేకర్స్ ఓ పోస్టర్ వదిలారు.

Peddi Movie Still

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan), బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) కాంబినేషన్‌లో వచ్చిన ‘పెద్ది’ సినిమా (Peddi Movie) బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమా మొదటి రోజు రూ. 135.36 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ని రాబట్టినట్లుగా మేకర్స్ అధికారికంగా ఓ పోస్టర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మొదటి రోజే ఈ సినిమా 100 కోట్ల క్లబ్‌లో చేరి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. రెండో రోజైన శుక్రవారం కూడా ఈ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో థియేటర్లలో దుమ్మురేపింది. తాజాగా మేకర్స్ ఈ సినిమా రెండు రోజుల కలెక్షన్స్‌కు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ప్రపంచవ్యాప్తంగా ‘పెద్ది’ సినిమా రెండు రోజులకు గానూ రూ. 181.8 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను (Peddi 2 Days Collections) రాబట్టి బాక్సాఫీస్ ఛాంపియన్‌గా దూసుకెళుతోంది. రెండో రోజు ఈ సినిమా దాదాపు రూ. 47 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను రాబట్టింది. ఇక వీకెండ్ అయిన శని, ఆదివారాల్లో ఈ సినిమా కలెక్షన్లపరంగా మ్యాజిక్ చేయబోతోందంటూ మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శనివారం అన్ని థియేటర్లలో హౌస్‌ఫుల్స్ అవుతుండగా, ఆదివారానికి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ కూడా రికార్డ్ స్థాయిలో నడుస్తోంది. మొత్తంగా అయితే ‘పెద్ది’ ప్రభంజనం ఇప్పుడప్పుడే ఆగేలా అయితే లేదు. ఇప్పటి వరకు ఫ్యాన్స్ మాత్రమే చూశారని.. సోమవారం నుంచి ఈ సినిమాను చూసేందుకు ఫ్యామిలీస్ కూడా కదులుతాయని.. తద్వారా కలెక్షన్లపరంగా ఎటువండి డ్రాప్స్ ఉండవని టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.


వాస్తవానికి ‘పెద్ది’ సినిమా ప్రీమియర్స్‌కు మిక్స్‌డ్ టాక్‌ని సొంతం చేసుకుంది. కానీ, గురువారం మార్నింగ్ షో పడినప్పటి నుంచి.. టాక్ మారిపోయింది. ఒక్క జాన్వీ కపూర్ పాత్రపై తప్పితే.. సినిమా గురించి అంతా పాజిటివ్‌గానే మాట్లాడుతున్నారు. ముఖ్యంగా రామ్ చరణ్ పాత్ర, యాక్టింగ్‌పై.. యాంటీ ఫ్యాన్స్ కూడా ప్రశంసలు కురిపిస్తుండటం విశేషం. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సమర్పించాయి.

ఇవి కూడా చదవండి:

‘పెద్ది’ పాత్రను ఎగతాళి చేసే వాళ్లంతా.. ముందు ఇది తెలుసుకోండి!

పవన్ కళ్యాణ్‌ని ‘దొర’ అంటావా.. ప్రకాశ్ రాజ్‌కి ఇచ్చిపడేసిన హేమ!

మీరు నిజంగానే పోరాడారు.. ‘పెద్ది’పై పవన్ కళ్యాణ్ బ్యానర్ పోస్ట్!

Updated Date - Jun 06 , 2026 | 05:45 PM

Peddi Trailer: గెలుపైనా.. ఓటమైనా కొండ కింద ఊరోడిదే కావాలా..

Peddi Movie: ట్రైలర్‌లోని ఆ షాట్‌కు.. నీకు గుడి కట్టేయవచ్చు బుచ్చి!

Peddi Movie: కథ విని, 20 నిమిషాల పాటు మనిషిని కాలేకపోయా- ప్రొడక్షన్ డిజైనర్

Ram Charan : నాన్న.. బాబాయ్‌.. తర్వాత గౌరవించేది ఆయన్నే!

Ram Charan : హాలీవుడ్‌కి మన దేశంలోని అందాలను చూపించాలి!

Buchi Babu: పెద్ది సన్నివేశాల్లో మార్పు.. దర్శకుడి వివరణ.