Ram Charan : హాలీవుడ్‌కి మన దేశంలోని అందాలను చూపించాలి!

ABN , First Publish Date - 2023-05-23T14:27:14+05:30 IST

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంతో గ్లోబల్‌స్టార్‌ అయ్యారు రామ్‌ చరణ్‌. ఇప్పుడాయన అంతర్జాతీయ స్థాయిలో ఫ్యాన్స్‌ను సొంతం సొంతం చేసుకున్నారు. కశ్మీర్‌లో జరుగుతున్న జీ20 సదస్సుకు భారతీయ చిత్ర పరిశ్రమ ప్రతినిధిగా రామ్‌చరణ్‌ హాజరయ్యారు.

Ram Charan : హాలీవుడ్‌కి మన దేశంలోని అందాలను చూపించాలి!

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) చిత్రంతో గ్లోబల్‌స్టార్‌ అయ్యారు రామ్‌ చరణ్‌ (Global Star Ram Charan) ఇప్పుడాయన అంతర్జాతీయ స్థాయిలో ఫ్యాన్స్‌ను సొంతం సొంతం చేసుకున్నారు. కశ్మీర్‌లో జరుగుతున్న జీ20 (G20 Summit) సదస్సుకు భారతీయ చిత్ర పరిశ్రమ ప్రతినిధిగా రామ్‌చరణ్‌ హాజరయ్యారు. సోమవారం మొదలైన ఈ సదస్సు మూడురోజులపాటు జరుగుతుంది. ఈ సదస్సులో 17 దేశాల నుంచి ఫిలింటూరిజం ఆర్థికాభివృద్థి, సాంస్కృతిక పరిరక్షణపై చర్చలు జరపనున్నారు. ఈ సందర్భంగా దక్షిణ కొరియా రాయబారి చాంగ్‌ జె.బోక్‌తో కలిసి చరణ్‌ ‘నాటు నాటు’ (naatu naatu) పాటకు స్టెప్పులేసి అలరించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నారు. ఈ వేదికపై రామ్‌చరణ్‌ మాట్లాడుతూ ‘‘భారతదేశంలో ఎంతో అందమైన, అద్భుతమైన లొకేషన్లు ఉన్నాయి. కశ్మీర్‌ లాంటి ప్రాంతంలో ఈ సదస్సు పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఇండియాలో కేరళ, కశ్మీర్‌.. ఇలా ఎన్నో ప్రాంతాలు ప్రకృతి ఆకట్టుకునేలా ఉంటాయి, ఈ లొకేషన్లు చిత్రీకరణకు ఎంతో అనువుగా ఉంటాయి. మన అందాల్ని నేను ప్రపంచానికి చూపించాలనుకుంటున్నా. మన అందాల్ని విదేశీయులు ఆస్వాదించాలని కోరిక. అందుకే ఇకపై నేను నటించే చిత్రాల షూటింగ్‌ ఎక్కువ శాతం ఇండియాలోనే జరపాలని కోరుకుంటున్నాను. కేవలం లొకేషన్ల కోసమే విదేశాలకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నా. ఒకవేళ నేను హాలీవుడ్‌ సినిమాల్లో నటించినా.. ఆ దర్శకులకు కూడా ఇండియా అందాలను చూపిస్తాను. వాళ్లనే ఇక్కడికి రమ్మని షరతు పెడతాను. ఇప్పుడు ఉత్తరాది, దక్షిణాది అని రెండు రకాల సినిమాలు లేవు. ఉన్నది ఒకటే అదే.. భారతీయ సినిమా. ఇప్పుడు ఇది గ్లోబల్‌ స్థాయిలో గుర్తింపు పొందింది’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో దిల్‌ రాజు కూడా పాల్గొన్నారు.

ఆయనే మాకు స్ఫూర్తి..

ఇదే వేదికపై రామ్‌చరణ్‌ తన తండ్రి గురించి మాట్లాడారు. ఆయనే తనకు స్ఫూర్తి అన్నారు. ‘‘నా చిన్నప్పుడు మా నాన్నతో కలిసి షూటింగ్‌ చూడడానికి కశ్మీర్‌కు ఒకసారి వచ్చాను. అదే మొదటిసారి. అప్పటి నుంచి ఎన్నోసార్లు ఇక్కడకు వచ్చాను. ఇప్పుడు ఇలా ఈ సదస్సులో పాల్గొనడానికి రావడం చాలా ఆనందంగా ఉంది. మా నాన్నగారికి 68 ఏళ్లు. ఇప్పటికీ సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. తెలుగులో అంత పెద్ద స్టార్‌ అయినా ఉదయం 5.30కు నిద్రలేచి పనిలో మునిగిపోతారు. సిమాఆపై ఆయనకు ఉన్న నిబద్థత అలాంటిది. ఆయన్ని చూసి చాలా విషయాలు నేర్చుకున్నాను’’ అని రామ్‌చరణ్‌ తెలిపారు.

Updated Date - 2023-05-23T15:07:31+05:30 IST