షూటింగ్ బ్రేక్‌లో పాయల్ రాజ్‌పుత్ చేసే పనులివా?
ABN, Publish Date - Apr 13 , 2026 | 07:11 PM
‘ఆర్ఎక్స్ 100’ చిత్రంతో తిరుగులేని సక్సెస్‌ని అందుకోవడమే కాకుండా, కుర్రాళ్ల గుండెల్ని పిండేసిన హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. ఆ సినిమా పాయల్‌కు ఎంత పేరు తెచ్చిందో.. అంతే నష్టాన్ని కూడా చేకూర్చింది. ‘ఆర్ఎక్స్ 100’ తర్వాత పాయల్ రాజ్‌పుత్ చేసిన ఏ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద నిలబడలేదు.
‘ఆర్ఎక్స్ 100’ (RX 100) చిత్రంతో తిరుగులేని సక్సెస్‌ని అందుకోవడమే కాకుండా, కుర్రాళ్ల గుండెల్ని పిండేసిన హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput). ఆ సినిమా పాయల్‌కు ఎంత పేరు తెచ్చిందో.. అంతే నష్టాన్ని కూడా చేకూర్చింది. ‘ఆర్ఎక్స్ 100’ తర్వాత పాయల్ రాజ్‌పుత్ చేసిన ఏ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద నిలబడలేదు. ఆమె ఎన్ని వైవిధ్యభరితమైన పాత్రలు చేసినా, అంతగా ప్రేక్షకులను ఆకర్షించలేదు. ‘ఆర్ఎక్స్ 100’ దర్శకుడు అజయ్ భూపతి (Ajay Bhupathi) దర్శకత్వంలో పాయల్ రాజ్‌పుత్ చేసిన మరో చిత్రం ‘మంగళవారం’ కూడా ఆమెకు సక్సెస్‌ని ఇవ్వలేకపోయింది. తన పాత్రకు విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి కానీ, సినిమా మాత్రం సక్సెస్ కాలేదు. ప్రస్తుతం ఆమె ఒక సాలిడ్ హిట్ కోసం ఎంతగానో వేచి చూస్తోంది. మరో వైపు సోషల్ మీడియాలో మాత్రం పాయల్ చాలా యాక్టివ్‌గా ఉంటూ.. ఫొటోలు, వీడియోలతో సందడి చేస్తుంటుంది.
ఈ క్రమంలో ఆమె షేర్ చేసిన కొన్ని ఫొటోలు, వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆమె ఇన్‌స్టా వేదికగా రెండు పోస్ట్‌లు చేశారు. అందులో ఒక పోస్ట్‌లో.. షూటింగ్ బ్రేక్ టైమ్‌లో డ్రస్సు నలిగిపోయి ఉండటంతో, తన స్టాఫ్‌తో ఐరన్ చేయించుకుంటున్నారు. విశేషం ఏమిటంటే, ఆమె డ్రస్ ఛేంజ్ చేసుకుని ఐరన్ చేయించుకోవడం లేదు.. తన బాడీకి డ్రస్సు ఉండగానే ఐరన్ చేయించుకుంటూ కనిపించడంతో.. నెటిజన్లు ఈ వీడియోపై సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ‘ఇంత అందానికి ఎన్ని కష్టాలు వచ్చాయి?’ అని కొందరు, ‘షూటింగ్ బ్రేక్‌లో మీరు చేసే పనులివా?’ అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
మరో వీడియోలో పొదుపుగా డ్రస్ ధరించి.. మేకప్ స్టాఫ్‌తో మేకప్ వేయించుకుంటున్నారు. ఈ వీడియోలో కూడా ఆమె.. తన డ్రస్ చాలా పొట్టిగా ఉందని సర్దుకుంటూ ఉండటం, చుట్టూ రింగులు కొడుతుండటం వంటి కామెడీ చేష్టలతో నెటిజన్లను అలరిస్తున్నారు. దీనికి.. ‘ఏంటి ఇంత ఖాళీగా ఉన్నావా పాయల్?’ అంటూ నెటిజన్లు రియాక్ట్ అవుతుండటం విశేషం. ప్రస్తుతం ఆమె ‘లీడర్’ (Leader) అనే సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
ఇది ప్రతి ఊరి కథ - ‘తిమ్మరాజుపల్లి టీవీ’ మూవీ దర్శకుడు
‘చిరంజీవి’కి మెగా బ్రదర్ నాగబాబు సపోర్ట్
సింగర్ మంగ్లీ కేసులో ట్విస్ట్.. ఇదంతా బిగ్‌బాస్ కోసమేనా?
Chiranjeevi: చిరంజీవికి తప్పని వెయిటింగ్.. ఈ అడ్డంకులేంటి?
UBS OTT: ఉస్తాద్ ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు.. స్ట్రీమింగ్ వివరాలివే!