Payal Rajput : ఇక వెంకటలచ్చిమి అని పిలుస్తారేమో!
ABN , Publish Date - Jan 25 , 2025 | 05:00 AM
పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న చిత్రం ‘వెంకటలచ్చిమి’. ముని దర్శకత్వంలో రాజా, ఎస్‌ఎస్ చౌదరి నిర్మించనున్న ఈ సినిమా శుక్రవారం పూజా కార్యక్రమాలతో
పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న చిత్రం ‘వెంకటలచ్చిమి’. ముని దర్శకత్వంలో రాజా, ఎస్‌ఎస్ చౌదరి నిర్మించనున్న ఈ సినిమా శుక్రవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ముని మాట్లాడుతూ ‘కథ అనుకున్నప్పుడే పాయల్ రాజ్‌పుత్ సరిపోతారనిపించింది. పాన్ ఇండియా సినిమాగా తెలుగుతో పాటు హిందీ, పంజాబీ భాషల్లో తెరకెక్కిస్తున్నాం. ఈ రివెంజ్ డ్రామా భారతీయ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించడం ఖాయం’ అని అన్నారు. హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ మాట్లాడుతూ ‘‘మంగళవారం’ సినిమా తర్వాత ఎన్నో కథలు విన్నాను. నచ్చక తిరస్కరించాను. ఈ సినిమా తర్వాత నా పేరు వెంకటలచ్చిమిగా స్థిరపడిపోతుందేమో అన్నంతగా బలమైన సబ్జెక్టు ఇది’ అని అన్నారు.