సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

పవన్ కళ్యాణ్‌కు తీవ్ర అస్వస్థత.. సర్జరీ!

ABN, Publish Date - Apr 18 , 2026 | 08:26 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్నాళ్లుగా హెల్త్ పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆయన ఎక్కువగా జ్వరం బారిన పడుతున్నట్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి.

AP Deputy CM Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్నాళ్లుగా హెల్త్ పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆయన ఎక్కువగా జ్వరం బారిన పడుతున్నట్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఆయన శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురవడంతో.. వ్యక్తిగత వైద్యుల సలహా మేరకు వైద్య పరీక్షలకు హాజరయ్యారు. ఈ పరీక్షల అనంతరం ఆయనకు సర్జరీ జరిగినట్లుగా.. జనసేన పార్టీ అధికారికంగా ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ ప్రకటనలో..

‘‘ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శనివారం సాయంత్రం శస్త్రచికిత్స జరిగింది. శుక్రవారం ఉదయం తన అధికారులతో పాలనాపరమైన విషయాలపై చర్చిస్తున్న సందర్భంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొద్ది నెలలుగా ఆరోగ్యపరంగా ఇబ్బందిపడుతున్నారు. దీంతో ఆయన వ్యక్తిగత వైద్యుల సలహాతో శుక్రవారం నాటి అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని ఆసుపత్రికి వెళ్లగా.. అక్కడ వైద్య పరీక్షలతోపాటు ఎం.ఆర్.ఐ. కూడా నిర్వహించారు.


ఎం.ఆర్.ఐ. రిపోర్ట్స్‌ను పరిశీలించిన వైద్యులు శస్త్ర చికిత్స చేయవలసి ఉంటుందని నిర్ణయించి, శస్త్రచికిత్స చేశారు. వారం నుంచి పది రోజులపాటు విశ్రాంతి తర్వాత ఆయన అధికారిక కార్యక్రమాలలో పాల్గొనవచ్చని డాక్టర్లు తెలిపారు. అయితే దీర్ఘకాలం తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుందని, పూర్తి స్వస్థత చేకూరడానికి ఎక్కువ కాలం పడుతుందని డాక్టర్లు తెలిపారు..’’ అని జనసేన పార్టీ రాజకీయ కార్యదర్శి పి. హరిప్రసాద్ ఈ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విషయం తెలిసి.. సినీ, రాజకీయ ప్రముఖులు.. ఆయన త్వరగా కోలుకుని, ఎప్పటిలానే పాలన కొనసాగించాలని కోరుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి:

పెళ్లికి సిద్ధమైన శృతిహాసన్.. ఆ లక్కీ వరుడు ఎవరో?

విష్ణుప్రియ దారిలోనే మరికొందరు.. ఆ కంటెంట్ కావాలంటే సబ్‌స్క్రైబ్ అవ్వాల్సిందే.

మంగ్లీ కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్.. అసలు కథ ఇప్పుడే మొదలైంది!

Updated Date - Apr 18 , 2026 | 08:36 PM