Dragon: డ్రాగన్ లో స్పెషల్ సాంగ్.. హాట్ బ్యూటీని దింపుతున్న నీల్..?

ABN , Publish Date - Jun 04 , 2025 | 04:46 PM

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR)  నటిస్తున్న చిత్రాల్లో ఎన్టీఆర్- నీల్(NTRNeel)  ఒకటి.  స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రుక్మిణి వసంత్(Rukmini Vasanth) హీరోయిన్ గా నటిస్తోంది.

Dragon

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR)  నటిస్తున్న చిత్రాల్లో ఎన్టీఆర్- నీల్(NTRNeel)  ఒకటి.  స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రుక్మిణి వసంత్(Rukmini Vasanth) హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ఏడాదిలోనే  పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ సినిమా టైటిల్ డ్రాగన్(Dragon)  అని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెల్సిందే.

 

దేవర తరువాత  ఎన్టీఆర్  ఒకపక్క  వార్ 2(War 2) ..ఇంకోపక్క డ్రాగన్  షూట్స్ లో బిజీగా మారాడు.  డ్రాగన్ పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. నీల్ కూడా ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా పనిచేస్తున్నాడు. ఈ చిత్రం గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా సోషల్ మీడియాలో  వైరల్ గా మారుతుంది. తాజాగా డ్రాగన్ కు సంబంధించిన ఒక వార్త  సోషల్ మీడియాను  షేక్ చేస్తోంది. 

Also Read: HariHara Veeramallu: రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేసిన పవన్.. కారణం అదే.. ?

 

మొదటి నుంచి ఈ చిత్రంలో ఒక స్పెషల్ సాంగ్ ఉంటుందని వార్తలు వినిపిస్తున్న విషయం తెల్సిందే.  ఈ సాంగ్ కోసం స్టార్ హీరోయిన్ల వేట మొదలుపెట్టాడట ప్రశాంత్ నీల్. మొదట బాలీవుడ్ బ్యూటీస్ ని రంగంలోకి దింపాలని ప్రయత్నించారట. కానీ, చివరకు రొమాంటిక్  భామ అయితే ఇంకా హైప్ పెరుగుతుందని కేతిక శర్మ(Ketika Sharma)ను  ఓకే చేసినట్లు సమాచారం. రొమాంటిక్ సినిమాతో కేతిక టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే అమ్మడు మంచి హిట్ అందుకుంటుంది అనుకున్నారు .. కానీ, లక్ కలిసిరాలేదు. ఆ తరువాత కుర్ర హీరోల సరసన కనిపించినా కూడా కేతికకు విజయం దక్కలేదు. 

 

ఇక ఆ సమయంలోనే  రాబిన్ హుడ్(Robin Hood) సినిమాలో అదిదా సర్ప్రైజ్ అంటూ ఒక స్పెషల్ సాంగ్ చేసింది. ఈ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేసింది.  కేతిక అందానికి, స్టెప్స్ కు ఫ్యాన్స్  ముగ్దులు అయ్యారు.  ఆ హైప్ తోనే ఆమె  నటించిన సింగిల్(Single) కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు  అదిదా సర్ప్రైజ్ సాంగ్ ను చూసిన ప్రశాంత్ నీల్ ఇంప్రెస్ అయ్యి.. డ్రాగన్ లో  స్పెషల్ సాంగ్ కు ఓకే చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కేతికతో సంప్రదింపులు  జరపగా ఆమె వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని సమాచారం. ఇదే కనుక నిజమైతే కేతిక పంట పండినట్లే. 

Updated Date - Jun 04 , 2025 | 04:47 PM