Dragon: ఒక్క డైలాగ్ రూపు మార్చేసింది.. ఇది ఆరంభం మాత్రమే..
ABN , Publish Date - May 21 , 2026 | 10:56 AM
ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న తారక్ నటిస్తున్న ‘డ్రాగన్’ సినిమా గ్లింప్స్ వచ్చేసింది. ఆయన పుట్టినరోజు సందర్భంగా బుధవారం 4.28 నిమిషాల నిడివి గల వీడియో గ్లింప్స్‌ను మేకర్స్ వదిలారు.
ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న తారక్ నటిస్తున్న ‘డ్రాగన్’ సినిమా గ్లింప్స్ వచ్చేసింది. ఆయన పుట్టినరోజు సందర్భంగా బుధవారం 4.28 నిమిషాల నిడివి గల వీడియో గ్లింప్స్‌ను మేకర్స్ వదిలారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
‘పొరపాటున కూడా నా కలలోకి రావొద్దు’ అంటూ
తారక్ చెప్పిన డైలాగ్ ఓ ప్రభంజనంలా మారింది. కొత్త రికార్డును సృషిస్తోంది. గ్లింప్స్ విడుదల చేసిన 24 గంటల్లో 64 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుందని టీమ్ వెల్లడించింది. ఇప్పటివరకూ ఇండియాలో ఏ సినిమా గ్లింప్స్‌కు ఇన్ని వ్యూస్ రాలేదని, ఆల్ టైం రికార్డు అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని ఫ్యూచర్‌లో మరిన్ని రికార్డులు సొంతం చేసుకోవడం ఖాయమని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు.
‘కె.జి.ఎఫ్’ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో పాపులర్ అయిన ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. వచ్చే ఏడాది జూన్ 11న ప్రేక్షకుల ముందుకురానుంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది, రుక్మిణి వసంత్ కథానాయిక. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.