సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఎన్టీఆర్ ‘డ్రాగన్’.. రంగంలోకి మరో మ్యూజిక్ డైరెక్టర్?

ABN, Publish Date - Oct 31 , 2026 | 07:14 PM

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘డ్రాగన్’. ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడో వార్త వైరల్ అవుతోంది.

Dragon Movie Music Director Update

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Man Of Masses Jr NTR), సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘డ్రాగన్’ (Dragon). తొలిసారి వీరిద్దరూ కలిసి చేస్తున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల్లోనూ భారీగా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ చూస్తుంటే.. తారక్‌ను ప్రశాంత్ నీల్ ఏ స్థాయిలో చూపించబోతున్నారో అర్థమవుతోంది. ఆ గ్లింప్స్ సినిమాపై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లిందని చెప్పవచ్చు. ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో తారక్ సరసన కన్నడ భామ రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) హీరోయిన్ నటిస్తోంది. అంతేకాకుండా బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్, మలయాళ దిగ్గజ నటుడు బిజు మీనన్, సీనియర్ నటి ఖుష్బూ వంటి స్టార్ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అయితే, ఈ భారీ ప్రాజెక్ట్‌కి సంబంధించి ప్రస్తుతం ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో ఓ క్రేజీ న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది.


అదేంటంటే.. ఈ సినిమా మ్యూజిక్ డిపార్ట్‌మెంట్‌లో మేకర్స్ ఓ ఊహించని పెద్ద మార్పు చేయబోతున్నారట. ప్రశాంత్ నీల్ సినిమా అనగానే అందరికీ గుర్తుకు వచ్చే పేరు... మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ (Ravi Basrur). నీల్ మొదటి సినిమా ‘ఉగ్రమ్’ నుంచి ‘కెజియఫ్’ సిరీస్, ‘సలార్: పార్ట్ 1’ వరకు.. నీల్ ఏ విజన్‌తో సీన్స్ డిజైన్ చేస్తే, దానికి తగినట్లు థియేటర్లు ఊగిపోయేలా రవి బస్రూర్ సౌండ్ ట్రాక్స్ ఇచ్చారు. హీరో ఎంట్రీ అయినా, విలన్లతో చేసే మాస్ ఎలివేషన్ సీన్స్ అయినా.. ఆ డస్ట్ అండ్ యాక్షన్ విజువల్స్‌కి రవి సౌండ్ డిజైన్ తోడవడంతో సినిమాలో ఉన్న దమ్ము రెట్టింపు అయింది. ఫలితంగా సినిమా సక్సెస్‌కు ఆయన సంగీతం కూడా ఓ ప్రధానకారణమైంది.

అయితే.. ఇటీవల రవి బస్రూర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో అదరగొడుతున్నప్పటికీ, పాటల విషయంలో అనుకున్నంత రెస్పాన్స్ రావడం లేదనే టాక్ సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ‘డ్రాగన్’ మేకర్స్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాకి రవి బస్రూర్ బిజిఎమ్ బాధ్యతలు చూసుకుంటుండగా.. పాటలు, అదనపు సౌండ్ ట్రాక్స్ కోసం ‘ధురంధర్’ (Dhurandhar) ఫేమ్ శాశ్వత్ సచ్‌దేవ్‌ (Shashwat Sachdev)ను కూడా రంగంలోకి దించుతున్నారట. 'ధురంధర్'తో ఆల్ ఇండియాని షేక్ చేసిన శాశ్వత్.. ఇప్పుడు ఎన్టీఆర్-నీల్ సినిమాకి పనిచేయనున్నాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఇద్దరు దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్లు కలిసి వర్క్ చేస్తే మ్యూజిక్ ఏ రేంజ్‌లో ఉంటుందో అని ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ఊహించుకుంటున్నారు. అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


ఇక ఇటీవలే గాయం నుంచి పూర్తిగా కోలుకున్న ఎన్టీఆర్ ఫుల్ జోష్‌తో ‘డ్రాగన్’ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఫిబ్రవరి నాటికి ఈ సినిమా చిత్రీకరణను పూర్తిగా పూర్తి చేయాలని మేకర్స్ డెడ్‌లైన్‌గా పెట్టుకున్నారట. ఇక అన్ని పనులు పూర్తి చేసి వచ్చే ఏడాది జూన్‌లో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మరి రవి బస్రూర్ - శాశ్వత్ లాంటి ఇద్దరు క్రేజీ సంగీత దర్శకుల కలయిక.. దానికి తోడు తొలిసారి ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ ‘డ్రాగన్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:

‘జంగా’లో శివగా త్రిగుణ్.. రా అండ్ రస్టిక్ పోస్టర్ వైరల్

జాన్వీ కపూర్‌ పై తెలుగు ఫ్యాన్స్ ఫైర్.. టాలీవుడ్‌లో ఇక కష్టమేనా?

తెలుగులో మరో ‘తారే జమీన్ పర్’.. ట్రైలర్ విడుదల

Updated Date - Oct 31 , 2026 | 07:14 PM