జాన్వీ కపూర్‌ పై తెలుగు ఫ్యాన్స్ ఫైర్.. టాలీవుడ్‌లో ఇక కష్టమేనా?

ABN , Publish Date - Oct 31 , 2026 | 06:01 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వచ్చిన ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’. ఈ సినిమాలో అచ్చియమ్మ పాత్రలో నటించిన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో అగ్గి రాజేస్తున్నాయి.

Janhvi Kapoor

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) - బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) కాంబినేషన్‌లో వచ్చిన ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ (Peddi). ఈ సినిమాలో అచ్చియమ్మ పాత్రలో నటించిన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో అగ్గి రాజేస్తున్నాయి. బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న పాపులర్ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’లో పాల్గొన్న జాన్వీ.. ‘పెద్ది’ సినిమాలో తన పాత్ర చిత్రీకరణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన పాత్రను తీవ్రంగా ఆబ్జెక్టిఫై చేశారని, కెమెరా యాంగిల్స్ అభ్యంతరకరంగా ఉన్నాయని, ఆ సమయంలో తాను నిలదీసి పెద్ద రచ్చ చేసి ఉండాల్సిందని పేర్కొంటూనే.. సౌత్ ఇండస్ట్రీలో బౌండ్ స్క్రిప్ట్స్ ఉండవంటూ చాలా తెలివిగా నెపాన్ని దర్శకుడిపైకి, సౌత్ వర్కింగ్ స్టైల్‌పైకి నెట్టేసే ప్రయత్నం చేశారు.


జాన్వీ కపూర్ ఆడిన ఈ ‘సేఫ్ గేమ్’పై తెలుగు ప్రేక్షకులు, ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె చేసిన ఈ డబుల్ స్టాండర్డ్ వ్యాఖ్యలకు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా గట్టి కౌంటర్లు ఇస్తున్నారు. గతంలో ఆమె నటించిన బాలీవుడ్ చిత్రాల్లోని బోల్డ్ దృశ్యాలు, గ్లామరస్ క్లిప్పింగ్స్‌ను ‘ఎక్స్’ వేదికగా తెరపైకి తెస్తూ ట్రోలింగ్ మొదలుపెట్టారు. బాలీవుడ్‌లో ఎలాంటి హద్దులు లేకుండా ఎక్స్‌పోజింగ్ చేసినప్పుడు గుర్తురాని మహిళా సాధికారత, అభ్యంతరాలు.. సౌత్ సినిమా దగ్గరకు వచ్చేసరికి ఎలా గుర్తొచ్చాయంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా, ‘పెద్ది’కి ముందు ఎన్టీఆర్ సరసన నటించిన ‘దేవర’లోనూ ఆమె గ్లామరస్ పాత్రలోనే కనిపించారని, కథ, పాత్రల స్వభావం పూర్తిగా తెలిసే సంతకం చేసి.. ఇప్పుడు నార్త్ షోలలో కూర్చొని సౌత్ సినిమాను చిన్నచూపు చూస్తూ మాట్లాడటం ఎంతవరకు న్యాయమని నిలదీస్తున్నారు.


టాలీవుడ్‌ను కించపరిచేలా బాలీవుడ్ వర్గాలు చేసే విమర్శల ట్రాప్‌లోనే జాన్వీ కూడా చిక్కుకుందని నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రస్తుతం సౌత్ ప్రేక్షకుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడిన జాన్వీ కపూర్‌కు భవిష్యత్తులో టాలీవుడ్‌లో అవకాశాలు రావడం కష్టమేనని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. తొలి రెండు సినిమాలతోనే ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి అగ్ర హీరోల సరసన నటించే సువర్ణావకాశాన్ని దక్కించుకున్న ఆమె.. పరిశ్రమను, దర్శకులను గౌరవించకుండా ఇలా మాట్లాడటం వల్ల ఇతర అగ్ర నిర్మాతలు, దర్శకులు ఆమెతో పనిచేయడానికి వెనకడుగు వేసే ప్రమాదం ఉందని ట్రేడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరి రోజురోజుకూ ముదురుతున్న ఈ వివాదంపై జాన్వీ కపూర్ ఏదైనా వివరణ ఇస్తారో లేదో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి:

తెలుగులో మరో ‘తారే జమీన్ పర్’.. ట్రైలర్ విడుదల

ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఫస్ట్ టైమ్.. ‘ఓ నా సిద్ధయ్య’ సాంగ్ లాంచ్

RC17 హీరోయిన్ SA కాదు, AP కాదు, PM కాదు.. అచ్చ తెలుగమ్మాయ్

Updated Date - Oct 31 , 2026 | 06:01 PM

Peddi Review: రామ్‌చరణ్‌ స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌ చిత్రం 'పెద్ది’ ఎలా ఉందంటే..

Janhvi Kapoor : టీనేజ్‌లోనే ఆ సమస్యలు ఎదుర్కొన్నా..!

Janhvi Kapoor: జిమ్‌ బయట అలా నాకు నచ్చదు!

Janhvi Kapoor: పుష్పరాజ్‌తో ఆడిపాడటానికి సై?

Janhvi Kapoor: అందాలను ఆరబోయడమేనా.. ఏమైనా అభినయం చూపించేది ఉందా