హీరో కాదు విలన్‌.. ‘డ్రాగన్‌’ స్టోరీ రివీల్‌ చేసిన నీల్ మామా!

ABN , Publish Date - May 21 , 2026 | 02:24 PM

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఒక సినిమా అనౌన్స్ అయిందంటేనే అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు ‘డ్రాగన్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేసి, గ్లింప్స్ వదిలిన విషయం తెలిసిందే.

NTR Dragon Update

బిగ్గెస్ట్ మాస్ ఎలివేషన్స్.. ఒళ్ళు గగుర్పొడిచే యాక్షన్ సీన్స్‌తో.. ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ‘KGF, సలార్’ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel). టాలీవుడ్‌ను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లిన పవర్‌ఫుల్ పర్ఫార్మర్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR). ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఒక సినిమా అనౌన్స్ అయిందంటేనే అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు తాజాగా ‘డ్రాగన్‌’ (Dragon) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అయితే, ఈ సినిమా గురించి తాజాగా బయటకు వచ్చిన కొన్ని అప్‌డేట్స్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. ఇందులో ఎన్టీఆర్ హీరోగా నటించడం లేదు.. ఒక పవర్‌ఫుల్ విలన్‌గా కనిపించబోతున్నారు. ఇది మేము చెబుతుంది కాదు. డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ టీజర్‌ రిలీజ్‌ అయిన సందర్భంగా స్టోరీని ఒక ఇంటర్వ్యూలో రివీల్ చేసి అందరినీ షాక్‌కు గురి చేశారు.


సాధారణంగా ప్రశాంత్ నీల్ సినిమాల్లో హీరో పాత్రలకు ఒక రకమైన నెగిటివ్ షేడ్ ఉంటుంది. కానీ, కథకు ఇచ్చే ప్రాధాన్యత కారణంగా ఆ పాత్రలే వెండితెరపై అద్భుతంగా మెరుస్తాయి. అయితే ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాల్లో హీరోను పూర్తిగా నెగిటివ్ వైపు నడిపించిన దాఖలాలు లేవు. డ్రాగన్ సినిమా మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉండబోతోంది. ఇందులో ఎన్టీఆర్ ఒక అస్సాసిన్ పాత్రలో కనిపిస్తారట. ప్రశాంత్ నీల్ తన కెరీర్‌లో రాసుకున్న క్యారెక్టర్స్ అన్నింటిలోకి ఇది అత్యంత డార్కెస్ట్ క్యారెక్టర్ అని స్వయంగా వెల్లడించారు. ఎన్టీఆర్ లాంటి ఒక గ్లోబల్ స్టార్ ఇలాంటి పూర్తి నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్‌ను అంగీకరించడం చాలా పెద్ద విషయం. ఇది ఆయన కెరీర్‌లోనే అత్యంత సాహసోపేతమైన నిర్ణయమని డైరెక్టర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ పాత్ర డిమాండ్ మేరకు ఎన్టీఆర్‌ను కొంచెం బరువు తగ్గమని ప్రశాంత్ నీల్ అడిగారట. దాంతో మన యంగ్ టైగర్ రంగంలోకి దిగారు. కఠినమైన డైట్, హెవీ వర్కవుట్లతో ఏకంగా 15 కిలోల బరువు తగ్గారు. ఒకానొక దశలో తారక్ చాలా బలహీనంగా కనిపించడంతో.. ఆందోళన చెందిన ప్రశాంత్ నీల్ స్వయంగా వచ్చి సార్, ఇక చాలు.. వర్కవుట్లు ఆపేయండని కోరినా.. ఎన్టీఆర్ వినలేదట. క్యారెక్టర్ పర్ఫెక్షన్ కోసం ఆయన చూపించిన ఆ డెడికేషన్ చూసి చిత్రయూనిట్ అంతా షాక్ అయిందంటే.. ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ ఈ సినిమాలో ఏ రేంజ్‌లో ఉండబోతుందో ఊహించుకుంటేనే పూనకాలు వస్తున్నాయి.


‘కె.జి.యఫ్, సలార్’ వంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాల తర్వాత.. ఈ తరహా జోనర్‌లో ప్రశాంత్ నీల్ చేస్తున్న చివరి చిత్రం ఇదే కావడం విశేషం. ఈ సినిమా ముగిసిన తర్వాత తను మరింత కలర్‌ఫుల్ సినిమాలు చేస్తానని, అలాగే తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఒక మైథాలజీ సినిమా వైపు అడుగులు వేస్తానని డైరెక్టర్ క్లారిటీ ఇచ్చారు. అంటే, ప్రశాంత్ నీల్ మార్క్ రా అండ్ రస్టిక్ యాక్షన్‌ను క్లైమాక్స్ రేంజ్‌లో చూడటానికి ఇదే లాస్ట్ ఛాన్స్ అన్నమాట. అంతేకాదు, గ్లింప్స్‌లో చూపించిన దానికి భిన్నంగా.. బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్ ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ విలన్ పాత్రలో కనిపిస్తారని డైరెక్టర్ హింట్ ఇచ్చారు. ఎన్టీఆర్, అనిల్ కపూర్ మధ్య వచ్చే సీన్స్ థియేటర్లలో మైండ్ బ్లోయింగ్‌గా ఉంటాయని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన బిగ్గెస్ట్ సర్‌ప్రైజ్ ఏంటో తెలుసా? గ్లింప్స్ చూస్తే ఇదొక డిస్టోపియన్, గ్యాంగ్‌స్టర్ డ్రామాలా అనిపించినప్పటికీ.. అంతర్లీనంగా ఈ సినిమా ఒక అద్భుతమైన దేశభక్తి చిత్రంగా ఉండబోతోందట. నెగిటివ్ షేడ్స్ ఉన్న ఒక అస్సాసిన్ కథకు.. దేశభక్తిని ఎలా ముడిపెట్టారు అనేదే ఈ సినిమాలోని అసలైన మ్యాజిక్. ఇక అన్నింటి కన్నా హైలెట్‌ విషయం ఏంటంటే ఈ సినిమా కథను ప్రశాంత్‌ నీల్‌, ఎన్టీఆర్‌ కలిసి డిజైన్‌ చేసినట్లుగా తెలపడం కొసమెరుపు. మొత్తంగా చూస్తే.. వయొలెన్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్ లాంటి టాలెంటెడ్‌ యాక్టర్‌తో కలిసి దేశభక్తి బ్యాక్‌డ్రాప్‌లో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయబోతున్నారో చూడాలి.

ఇవి కూడా చదవండి:

చిరుకి కాదు.. బాలయ్యకు విలన్‌గా మనోజ్!

Peddi Movie: 24 గంటల్లో ‘పెద్ది’ ట్రైలర్ బీభత్సం.. హిస్టారికల్ రికార్డ్!

యంగ్ టైగర్‌కు పవర్ స్టార్ బర్త్‌డే విషెస్.. ట్వీట్ వైరల్!

నాకు కాబోయే భర్త ఇండస్ట్రీ వ్యక్తి కాకూడదు: అనన్య నాగళ్ల

Updated Date - May 21 , 2026 | 02:51 PM

Dragon Glimpse: పొరపాటున కూడా నా కల్లోకి రావొద్దు.. అదిరిపోయిన గ్లింప్స్ 

Dragon: అదేంటి అది.. మొన్నే అవుట్ ఫుట్ బాలేదన్నారు.. ఇప్పుడు రెండు పార్ట్స్ అంటారేంటి

Dragon: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు.. బిగ్ షాక్‌: NTR - ప్రశాంత్ నీల్.. సినిమా 'డ్రాగన్' కాదట! రిలీజ్ మ‌రింత‌ ఆల‌స్యం?

Dragon: ఎన్టీఆర్ మూవీలో విద్యాబాలన్...

Dragon: ఒక్క డైలాగ్‌ రూపు మార్చేసింది.. ఇది ఆరంభం మాత్రమే..