సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

హీరోయిన్ కాదు.. రాకాలో రష్మికకు భారీ ట్విస్ట్?

ABN, Publish Date - Sep 24 , 2026 | 10:29 AM

రష్మిక ప్రస్తుతం రణబాలి, మైసా సినిమాల్లో నటిస్తోంది. అయితే, ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న ఒక న్యూస్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.

raaka rashmika

నేషనల్ క్రష్ రష్మిక దేవ‌ర‌కొండ (devarakonda).. టాలీవుడ్‌లో 'ఛలో' అంటూ అడుగుపెట్టి, అతి తక్కువ కాలంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. 'గీత గోవిందం'తో యూత్‌ను కట్టిపడేసి, 'డియర్ కామ్రేడ్', 'సరిలేరు నీకెవ్వరు', 'ది గర్ల్‌ఫ్రెండ్' వంటి వరుస బాక్సాఫీస్ హిట్స్‌తో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఇక పాన్ ఇండియా సంచలనం 'పుష్ప' చిత్రంలో 'శ్రీవల్లి'గా డీ-గ్లామర్ లుక్‌లో కనిపించి దేశవ్యాప్తంగా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ ఇంపాక్ట్ అలా కొనసాగుతుండగానే, బాలీవుడ్‌లో రణబీర్ కపూర్ సరసన 'యానిమల్' మూవీతో బాక్సాఫీస్ రికార్డుల సునామీ సృష్టించింది. కేవలం గ్లామర్, లవ్ స్టోరీస్ మాత్రమే కాకుండా, నటిగా తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ఆమె నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది.

ప్రస్తుతం రష్మిక రణబాలి, మైసా సినిమాల్లో నటిస్తోంది. అయితే, ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న ఒక న్యూస్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (allu arjun), కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ (atlee) కాంబినేషన్‌లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ రాకా (raaka). ఈ చిత్రంలో రష్మిక భాగం కాబోతోందనే వార్త ఎప్పటినుంచో నడుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఆమె అధికారికంగా 'రాకా' టీమ్‌తో జాయిన్ అయినట్లు తెలుస్తోంది.

ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరిచే అసలైన ట్విస్ట్ ఏంటంటే.. ఈ సినిమాలో రష్మిక రెగ్యులర్ హీరోయిన్‌గా నటించడం లేదు. కథను కీలక మలుపు తిప్పే ఒక పవర్‌ఫుల్ పాత్రలో ఆమె కనిపించబోతోందట. సినిమాను ముందుకు నడిపించే అత్యంత ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో ఇదొకటిగా నిలుస్తుందని సమాచారం. ముఖ్యంగా, ఈ క్యారెక్టర్‌లో నెగిటివ్ షేడ్స్ కూడా ఉంటాయని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. చిత్రబృందం కూడా ఈ క్యారెక్టర్‌పై ఎలాంటి వివరాలు బయటపెట్టకుండా పూర్తి సస్పెన్స్‌ను మెయింటైన్ చేస్తుండటంతో, సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి.

ఇక 'రాకా'లో బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొణె మెయిన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కీలక పాత్రల్లో మెరవనున్నారట. వీరితో పాటు రష్మిక తోడవడంతో ఈ ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా విపరీతమైన హైప్ క్రియేట్ అవుతోంది. అంతేకాదు, ఈ చిత్రం విడుదల కాకముందే గిన్నిస్ వరల్డ్ రికార్డును నెలకొల్పింది.

టెక్నికల్‌గా అంతర్జాతీయ స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ భారీ యాక్షన్ చిత్రంలో అల్లు అర్జున్ విశ్వరూపం ఎలా ఉండబోతోంది? నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో రష్మిక ఎలాంటి మేజిక్ చేయబోతోంది? అనేది ఇప్పుడు సినీ ప్రియుల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాలంటే చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Updated Date - Sep 24 , 2026 | 12:18 PM