బాలయ్యకు నయనతార ‘నో’ చెప్పడానికి కారణమిదేనా?

ABN , Publish Date - Apr 25 , 2026 | 01:07 PM

ఇండస్ట్రీలో సెంటిమెంట్స్‌కే ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. కొన్ని సందర్భాలలో మాత్రమే వాటిని మార్చడానికి మన వాళ్లు ప్రయత్నిస్తుంటారు. ఇప్పుడు బాలయ్య, నయనతార ప్రాజెక్ట్ విషయంలో కూడా అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి.

Balakrishna and Nayanthara

ఇండస్ట్రీలో సెంటిమెంట్స్‌కే ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. కొన్ని సందర్భాలలో మాత్రమే వాటిని మార్చడానికి మన వాళ్లు ప్రయత్నిస్తుంటారు. అందులో బాలయ్య (Balakrishna) పక్కన నయనతార (Nayanthara) ఉంటే, ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్‌ హిట్టే.. కానీ, ఇప్పుడు ఆ హిట్‌ కాంబోకు బ్రేక్ పడింది. నాలుగోసారి ఈ జోడీని వెండితెరపై చూద్దామనుకున్న ఫ్యాన్స్‌కు గట్టిగానే షాక్ తగిలింది. అవును.. NBK 111 నుంచి లేడీ సూపర్ స్టార్ తప్పుకున్నారనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఇది ఆమె తీసుకున్న నిర్ణయమా? లేక మేకర్స్ తీసుకున్న రిస్కా?


సినిమా అంటే గ్లామర్ మాత్రమే కాదు.. పక్కా బిజినెస్ కూడా! సౌత్‌ ఇండియన్‌ లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార క్రేజ్‌ ఏంటో ప్రతి ఒక్కరికీ తెలుసు. 40 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోయిన్లకు ధీటుగా సినిమాలు చేస్తూ, అదేస్థాయిలో రెమ్యునరేషన్ డిమాండ్ చేసే సత్తా ఆమెది. రీసెంట్‌గా ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ (Mana Shankara Vara Prasad Garu) సినిమా కోసం మొదట రూ.14 కోట్లు అడిగారట. రీజనల్ సినిమా కాబట్టి చివరకు రూ. 7 కోట్లకు డీల్ కుదిరింది. ఆ సినిమా హిట్ అవ్వడంతో నయన్ తన గ్రాఫ్ అస్సలు తగ్గించకూడదని ఫిక్స్ అయ్యారు. అదే ఇప్పుడు బాలయ్య సినిమాకు ఇబ్బందిగా మారిందని టాక్. గోపీచంద్ మలినేని (Gopichand Malineni) ముందుగా ప్లాన్ చేసిన పీరియాడిక్ కథలో నయన్‌ది ఒక మహారాణి పాత్ర. ఆ పవర్ ఫుల్ రోల్ కోసం ఎంత ఖర్చు చేయడానికైనా నిర్మాతలు రెడీ అయ్యారు. కానీ, అనూహ్యంగా కథ మారింది.. బడ్జెట్ లెక్కలు మారాయి. క్యారెక్టర్ వెయిట్ తగ్గినప్పుడు, అంత భారీ పారితోషికం ఇచ్చి నయన్‌ను తీసుకోవడం అవసరమా? అనే ఆలోచనలో నిర్మాతలు పడ్డారట. పైగా, ప్రమోషన్లకు రాననే ఆమె కండిషన్ కూడా ఈ సారి మేకర్స్‌కు మైనస్‌గా అనిపించిందట.


ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. నయనతార చూపు ఇప్పుడు బాలీవుడ్ వైపు ఉంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సల్మాన్ ఖాన్‌తో చేయబోయే సినిమా కోసం ఆమెకు కళ్లు చెదిరే ఆఫర్ వచ్చింది. ఒకవైపు బాలయ్య సినిమా ఆలస్యమవడం, మరోవైపు సల్మాన్ సినిమా డేట్స్ క్లాష్ అవ్వడంతో నయన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే టాలీవుడ్ హిట్ కాంబో బాలయ్య-నయన్ కాంబోలో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలన్నీ మంచి సక్సెస్ సాధించాయి. ‘సింహా, శ్రీరామరాజ్యం, జై సింహా.. ఇలా హ్యాట్రిక్ హిట్స్ ఉన్న జోడీని విడగొట్టడం అంటే మేకర్స్ చేస్తున్న పెద్ద సాహసమే అని చెప్పుకోవాలి. అందుకే బాలయ్య క్రేజ్‌కు తగ్గట్టుగా ఈ సినిమాలో టాలీవుడ్‌ చందమామ కాజల్‌ అగర్వాల్‌ను హీరోయిన్‌గా సెలక్ట్‌ చేసుకున్నారట. ఇప్పటికే బాలయ్య, కాజల్‌ కాంబోలో వచ్చిన ‘భగవంత్‌ కేసరి’ సూపర్‌ హిట్ సాధించింది. మరి ఈ చిత్రం కూడా ఎలాంటి విజయాన్ని నమోదు చేస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:

Varanasi: మహేష్ కోసమే ఆ కష్టాలు.. జక్కన్న పక్కా ప్లానింగ్!

స్రవంతి చొక్కారపు.. చీరకట్టులో ఎంత అందంగా ఉందో!

అందుకే చిరు.. ‘ఠాగూర్’ సినిమాపై రాజశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు

‘పెద్ది’ రిలీజ్ డేట్.. మరోసారి ‘లెనిన్’ త్యాగం చేయాల్సిందేనా!

Updated Date - Apr 25 , 2026 | 01:07 PM

Nayanthara : బాధపెట్టాం... క్షమించండి

Nayanthara : వామ్మో... అంతనా....

Nayanthara gets Emotional: 22 యేళ్ళ జర్నీని తలుచుకున్న నయన్

Nayanthara: నయనతార చాలా కాస్ట్లీ.. ఒక్క సెకన్ కు ఎంతో తెలుసా

Balakrishna - Vijaya Shanthi: 32 ఏళ్ళ తర్వాత మరొక్కసారి... సూపర్ హిట్ జోడీ...