Nayanthara gets Emotional: 22 యేళ్ళ జర్నీని తలుచుకున్న నయన్
ABN , Publish Date - Oct 09 , 2025 | 09:05 AM
సౌతిండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార నటిగా 22 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మలయాళ చిత్రాలతో పరిశ్రమలోకి అడుగుపెట్టిన నయనతార ఇవాళ క్రేజీ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
సౌతిండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayantara) ఎమోషనల్ అయ్యింది. సరిగ్గా 22 సంవత్సరాల క్రితం తాను తొలిసారి కెమెరా ముందు నిలుచుకున్నానని తెలిపింది. సోషల్ మీడియాలో నయనతార ఓ పోస్ట్ పెడుతూ, తన భావోద్వేగాలకు అద్దం పట్టింది. 'నేను తొలిసారి కెమెరా ముందు నిలబడి 22 సంవత్సరాలు అయ్యింది. సినిమాలను నేను జీవితంలో ఇంతగా ప్రేమిస్తానని అప్పుడు తెలియదు. ప్రతి షాట్, ప్రతి ఫ్రేమ్, ప్రతి నిశబ్దం... నన్ను నన్నుగా తీర్చిదిద్దాయి. నాకు స్వాంతన చేకూర్చాయి. నన్ను నన్నుగా చేశాయి... ఎప్పటికీ కృతజ్ఞతలతో...' అంటూ తన మనసులోని భావాలను నయనతార వ్యక్తపర్చింది. 2023లో విడుదలైన మలయాళ చిత్రం 'మనస్సినక్కరే' నయన్ తొలి చిత్రం. ఇందులో జయరామ్ హీరోగా నటించాడు. అయితే... రజనీకాంత్ 'చంద్రముఖి' సినిమాతో నయనతార స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. పలు భాషలలో కమర్షియల్ హీరోయిన్ గా నటిస్తూనే, లేడీ ఓరియంటెడ్ చిత్రాలకూ శ్రీకారం చుట్టింది. దక్షిణాదిన అత్యధిక పారితోషికం అందుకునే నాయికగా ఎదిగింది. దర్శకుడు విఘ్నేష్ శివన్ ను వివాహం చేసుకున్న నయన తార ఇప్పుడు ఇప్పుడు ఇద్దరు కవలల తల్లి.
లేడీ సూపర్ స్టార్ గా మన్ననలు అందుకుంటున్న నయనతార 'జవాన్' మూవీతో బాలీవుడ్ లోనూ జయకేతనం ఎగరేసింది. ప్రస్తుతం తెలుగులో చిరంజీవి (Chiranjeevi) సరసన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాలో నాయికగా నటిస్తోంది. అంతేకాదు... తమిళ, కన్నడ, మలయాళ భాషా చిత్రాలలో నాయికగా నటిస్తోంది. ఇదిలా ఉంటే... నయనతార, కవిన్ జంటగా నటిస్తున్న చిత్రానికి 'హాయ్' అనే టైటిల్ ను అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించిన రెండు పోస్టర్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. కవిన్, నయన్ ఓ ఇంటి మీద కూర్చుని ఒకరిని ఒకరు చేస్తుకుంటున్న ఈ పోస్టర్ ఆసక్తిని కలిగించేలా ఉంది. ఈ రొమాంటిక్ డ్రామాతో విష్ణు ఎడవన్ దర్శకుడిగా పరిచయమౌతున్నాడు.