నాని ‘ది ప్యారడైజ్’ మళ్లీ వాయిదా.. అసలు కారణం ఇదేనా
ABN , Publish Date - Jun 17 , 2026 | 08:31 PM
నేచురల్ స్టార్ నాని, మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ ఎనర్జిటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’. ఈ సినిమా మరోసారి వాయిదా పడినట్లుగా టాక్ నడుస్తోంది.
నేచురల్ స్టార్ నాని (Natural Star Nani), మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ ఎనర్జిటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’ (The Paradise). ‘దసరా’ సినిమాతో మాస్ ఆడియన్స్‌కు ఎంతగానో చేరువయ్యారు నాని. ఆ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇప్పుడు అదే మ్యాజిక్‌ను రిపీట్ చేసేందుకు ‘ది ప్యారడైజ్’తో సిద్ధమవుతున్నారు. ఇందులో నాని సరసన కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలోని క్యాస్టింగ్ ఓ రేంజ్‌లో ఉండబోతోంది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు వంటి భిన్నమైన నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనుండటం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. మోహన్ బాబు వంటి సీనియర్ నటుడు ఈ ప్రాజెక్ట్‌లో భాగమవ్వడం సినిమా కథపై ఉన్న వెయిట్‌ను స్పష్టం చేస్తోంది.
అయితే, సినిమా పట్టాలెక్కి ఏడాదిన్నర కావస్తున్నా.. ఇంకా రిలీజ్ విషయంలో పలు అవాంతరాలు ఎదురవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఇంకా 30 రోజులకు పైగా షూటింగ్ పెండింగ్‌లో ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. శ్రీకాంత్ ఓదెల ప్రతి సీన్‌ను ఎంతో పర్ఫెక్ట్‌గా చెక్కుతుండటం, భారీ యాక్షన్ సీక్వెన్స్‌ల కారణంగానే ఈ జాప్యం జరుగుతోందని తెలుస్తోంది. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదనే ఉద్దేశ్యంతోనే చిత్ర బృందం సమయం తీసుకుంటోంది. మొదట ఈ చిత్రాన్ని మార్చిలో, ఆ తర్వాత ఆగస్ట్‌లో విడుదల చేయాలని భావించినప్పటికీ, పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేయడానికి సమయం పడుతుండటంతో ఏకంగా డిసెంబర్‌కు పోస్ట్‌పోన్ చేసినట్లు టాక్.
సినిమా ఆలస్యమవుతున్నా, నాని మాత్రం తన ప్రమోషనల్ ప్లానింగ్‌లో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ‘దసరా’ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో ఏ విధంగా అయితే మార్కెటింగ్ చేశారో, ‘ది ప్యారడైజ్’ కోసం కూడా అదే రేంజ్‌లో భారీ ఎత్తున ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే దీని కోసం ఒక పక్కా ప్రణాళికతో పాటు, ప్రమోషనల్ బడ్జెట్‌ను కూడా భారీగానే కేటాయించినట్లు సమాచారం. నార్త్ ఆడియన్స్‌ను సైతం ఆకర్షించేలా కంటెంట్‌ను డిజైన్ చేశారని, అందుకే ప్రమోషన్స్ విషయంలో నాని ఎంతో కాన్ఫిడెంట్‌గా ఉన్నాడని విశ్లేషకులు భావిస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల టేకింగ్, నాని పర్ఫార్మెన్స్, విభిన్నమైన క్యాస్టింగ్.. వీటికి తోడు పక్కా ప్రమోషనల్ స్ట్రాటజీ.. ఇవన్నీ కలిస్తే ‘ది ప్యారడైజ్’ చిత్రానికి మంచి హైప్ క్రియేట్ కావడం పక్కా.. మరి నాని వేసిన ఈ పాన్ ఇండియా ప్రమోషనల్ ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో తెలియాలంటే డిసెంబర్ వరకు వేచి చూడాల్సిందే!
ఇవి కూడా చదవండి:
మంచు విష్ణు ‘కన్నప్ప’ రీ రిలీజ్.. ఈ సారైనా?
‘బెంగళూరు నాగరత్తమ్మ’.. సింగీతం ఈ డ్రీమ్ ప్రాజెక్ట్‌ను తెరపైకి తెచ్చేదెవరో..
ప్రధాని మోదీ వీడియోలో.. అల్లు అర్జున్ AA23 థీమ్.. దేశవ్యాప్తంగా వైరల్