The Paradise: ది ప్యారడైజ్.. నాని జడల్ లుక్
ABN , Publish Date - Aug 08 , 2025 | 10:16 AM
హ్యాట్రిక్ విజయాల తర్వాత నాచురల్ స్టార్ నాని (Nani) నటిస్తోన్న కొత్త చిత్రం ది ప్యారడైజ్.
హ్యాట్రిక్ విజయాల తర్వాత నాచురల్ స్టార్ నాని (Nani) నటిస్తోన్న కొత్త చిత్రం ది ప్యారడైజ్ (The Paradise). దసరా వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత శ్రీకాంత్ ఓదెల తిరిగి నానితో ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండడంతో అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఈ సినిమాను 2026 సమ్మర్‌లో మార్చి26న థియేటర్లకు తీసుకు వస్తున్నట్లు ప్రకటిస్తూ ఈ మూవీ నుంచి విడుదల చేసిన గ్లింప్స్ పెను సంచలనమే సృష్టించింది. నాటి నుంచి నేటికి కూడా ఈ సినిమా వార్తల్లో నిలుస్తూనే వస్తోంది.
అయితే.. ఈ మూవీ మేకర్స్ సడన్‌గా ఈ చిత్రం నుంచి ఓ అప్డేట్ ఇచ్చి అభిమానులకు సర్‌ఫ్రైజ్ ఇచ్చారు. తాజాగా సినిమాకు సంబంధించి ఉదయం 10 గంటల 5నిమిషాలకు ప్రసెంటింగ్ జడల్ అంటూ నాని జడలతో ఉన్న పోస్టర్‌ను రిలీజ్ చేశారు. మరోక పోస్టర్‌ను సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే.. తాజాగా విడుదల చేసిన నాని పోస్టర్‌ను చూస్తే.. హాలీవుడ్ సినిమా మెన్ ఇన్ బ్లాక్3లో విలన్ పాత్రదారి బోరిస్ ది ఎనిమల్ లుక్‌ను పోలి ఉండడం గమనార్హం.