The Paradise: రూమర్స్ కు చెక్.. చెప్పిన టైమ్ కే వస్తున్న నాని
ABN , Publish Date - Jun 28 , 2025 | 03:27 PM
న్యాచురల్ స్టార్ నాని (Nani) గత కొన్నేళ్లుగా మంచి మంచి కథలను ఎంచుకొని భారీ విజయాలను అందుకుంటున్నాడు.
The Paradise: న్యాచురల్ స్టార్ నాని (Nani) గత కొన్నేళ్లుగా మంచి మంచి కథలను ఎంచుకొని భారీ విజయాలను అందుకుంటున్నాడు. ఒకప్పుడు పక్కింటి కుర్రాడు అనిపించుకున్న నాని.. ఇప్పుడు ట్యాగ్ లైన్ ను చెరపడానికి చూస్తున్నాడు. ప్రస్తుతం మాస్ హీరో ట్యాగ్ లైన్ కోసం నాని తెగ తంటాలు పడుతున్నాడు. అందులో భాగంగానే సరిపోదా శనివారం, హిట్ 3 లాంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హిట్ 3 (Hit 3) లో నాని అలా బూతులు మాట్లాడడం, రక్తపాతం సృష్టించడం చూసి నాని ఫ్యామిలీ ఆడియెన్స్ షాక్ అయ్యారు. ఏంటి మన నానినే అని ఆశ్చర్యపోయారు.
ఇక ఇప్పుడు హిట్ 3 కి మించిన కథతో రబోస్తున్నాడు నాని. అయన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటి దసరా. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఈ కాంబోలో వస్తున్న మరో చిత్రం ది ప్యారడైజ్. ఇప్పటివరకు నాని చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే.. ది ప్యారడైజ్ మరో ఎత్తు అని చెప్పొచ్చు. మునుపెన్నడూ చూడని నానిని శ్రీకాంత్ ఓదెల ప్యారడైజ్ లో చూపించబోతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టైటిల్ టీజర్ ఏ రేంజ్ లో సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇక ఆ టైటిల్ టీజర్ చూసిన ప్రేక్షకులు షాక్ అయ్యారు. ఇలాంటి సినిమా కోసమే కదా ఎదురుచూస్తుంది అనుకున్నారు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 26 న రిలీజ్ కు సిద్దమవుతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే గత కొన్నిరోజులుగా ది ప్యారడైజ్ రిలీజ్ డేట్ మారిందని, షూటింగ్ కూడా వాయిదా పడిందని వార్తలు వచ్చాయి. హిట్ 3 వైలెన్స్ ఎక్కువ కావడంతో నానిపై నెగిటివిటి ఎక్కువ అయ్యింది. దానికి తోడు బడ్జెట్ కష్టాలు కూడా తోడయ్యాయని చెప్పుకొచ్చారు. అందుకే నాని కొద్దిగా గ్యాప్ తీసుకొని షూటింగ్ మొదలుపెడదామని శ్రీకాంత్ కు చెప్పడంతో ఆయన కూడా ఓకే అన్నట్లు కూడా మాట్లాడుకున్నారు.
ఇక ఇంకోపక్క మార్చి 27 న పెద్ది రిలీజ్ డేట్ ను ప్రకటించింది. రామ్ చరణ్ - బుచ్చిబాబు సానా కాంబోలో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. చరణ్ తో పోటీ ఎందుకని, నెమ్మదిగా షూటింగ్ చేసుకొని డేట్ మార్చుకుంటే బావుంటుందని, అందుకే ప్యారడైజ్ సెట్స్ మీదకు వెళ్లకుండా ఆగిందని కూడా రూమర్స్ వచ్చాయి. ఇక తాజాగా ఈ రూమర్స్ అన్నింటికీ చెక్ పెట్టారు మేకర్స్. నాని షూటింగ్ లో పాల్గొన్నాడు అంటూ ఒక అద్భుతమైన అప్డేట్ ను పోస్టర్ తో సహా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో నాని కాలిని మాత్రమే చూపిస్తూ ధగడ్.. ది ప్యారడైజ్ లో జాయిన్ అయ్యాడు అంటూ చెప్పుకొచ్చారు. నాని వెయిట్ ప్లేట్స్ పై అడుగు పెట్టిన నాని కాలికి వాచ్ ఉండడం విశేషం. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో నాని ఎలాంటి విజయాన్ని అందుకుంటాడు అనేది చూడాలి.