సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Nani: ఢిల్లీలో నాని యాక్షన్ షురూ.. సుజీత్ విధ్వంసం!

ABN, Publish Date - Oct 19 , 2026 | 12:39 PM

నాని వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఇప్పుడు స్టైలిష్ యాక్షన్ డ్రామాతో సందడి చేయబోతున్నారు. ‘

నాని (nani) వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఇప్పుడు స్టైలిష్ యాక్షన్ డ్రామాతో సందడి చేయబోతున్నారు. ‘ఓజి’ ఫేమ్ దర్శకుడు సుజీత్‌తో నాని చేస్తున్న సినిమా ‘బ్లడీ రోమియో’(bloody Romio) తాజాగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావడంతో ప్రాజెక్టుకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.

ఢిల్లీలో లాంగ్ షెడ్యూల్..

‘బ్లడీ రోమియో’ చిత్రీకరణ ప్రస్తుతం న్యూఢిల్లీలో జరుగుతున్నట్లు సమాచారం. అక్కడ సుమారు వారం రోజుల పాటు షెడ్యూల్‌ను ప్లాన్ చేశారట. ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత చిత్ర బృందం హైదరాబాద్‌కు తిరిగి వచ్చి తదుపరి షెడ్యూల్‌ను ప్రారంభించనున్నారని తెలిసింది. ఈ షెడ్యూల్ లో సినిమాకు  కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించేందుకు దర్శకుడు సుజీత్  ప్లాన్ చేసారు. ముఖ్యంగా ఇంటర్వెల్‌కు ముందు వచ్చే భారీ ఫైట్ సీన్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ కీలక యాక్షన్ ఎపిసోడ్‌నే చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాలో ఈ ఫైట్ కీలక మలుపుగా నిలిచే అవకాశం ఉందని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. సుజీత్ గతంలో తెరకెక్కించిన యాక్షన్ చిత్రాల్లో స్టైలిష్ మేకింగ్, వేగవంతమైన కథనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇప్పుడు నాని వంటి సహజ నటనకు పేరుగాంచిన హీరోతో ఆయన సినిమా చేస్తుండటంతో, ఈ ఇద్దరి కలయికలో ఎలాంటి కొత్తదనం ఉండబోతోందనే ఆసక్తి నెలకొంది. నాని పాత్రను సుజీత్ ఎలా డిజైన్ చేశారో, ఆయనను ఏ తరహా యాక్షన్ అవతార్‌లో చూపించబోతున్నారో చూడాలి.

పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర..

‘బ్లడీ రోమియో’లో పృథ్వీరాజ్ సుకుమారన్ భాగం కావడం విశేషం. నాని, పృథ్వీరాజ్‌ల కలయిక సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. కథానాయికగా ఎవరు నటించబోతున్నారనే విషయంపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తున్నారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామాను 2027 వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.  

ఇవి కూడా చదవండి:

లాస్ ఏంజెల్స్‌లో ‘రామాయణ’ హిస్టారికల్ వరల్డ్ ప్రీమియర్.. ఎప్పుడంటే?

మనం ఎప్పుడూ భయపడకూడదు.. ఇచ్చిపడేయాలి: విశ్వక్‌సేన్

యంగ్ హీరోతో ‘ఓ పిట్టకథ’ దర్శకుడి చిత్రం ప్రారంభం

Updated Date - Oct 19 , 2026 | 01:28 PM