లాస్ ఏంజెల్స్‌లో ‘రామాయణ’ హిస్టారికల్ వరల్డ్ ప్రీమియర్.. ఎప్పుడంటే?

ABN , Publish Date - Oct 18 , 2026 | 10:39 PM

భారతీయ చలనచిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పౌరాణిక దృశ్యకావ్యం ‘రామాయణ’ అంతర్జాతీయ యవనికపై సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది.

Ramayana Movie Still

భారతీయ చలనచిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పౌరాణిక దృశ్యకావ్యం ‘రామాయణ’ (Ramayana) అంతర్జాతీయ యవనికపై సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. రణ్‌బీర్ కపూర్ (రాముడు), రాకింగ్ స్టార్ యశ్ (రావణుడు), సాయి పల్లవి (సీత) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ పాన్-వరల్డ్ చిత్రానికి సంబంధించిన వరల్డ్ ప్రీమియర్ తేదీ, వేదిక అధికారికంగా ఖరారయ్యాయి. అక్టోబర్ 27న హాలీవుడ్ రాజధాని లాస్ ఏంజెల్స్‌లోని ప్రఖ్యాత ‘అకాడమీ మ్యూజియం ఆఫ్ మోషన్ పిక్చర్స్’ (Academy Museum) లో ఉన్న డేవిడ్ గెఫెన్ థియేటర్‌లో ఈ సినిమా గ్రాండ్ వరల్డ్ ప్రీమియర్ అత్యంత ఘనంగా జరగనుంది.


అంతర్జాతీయ చలనచిత్ర చరిత్ర, సినిమా కళ, సాంకేతికతకు అత్యున్నత కేంద్రంగా ఉన్న అకాడమీ మ్యూజియం.. ఆస్కార్ వేడుకలతో పాటు అంతర్జాతీయ దిగ్గజ చిత్రాల కార్యక్రమాలకు మాత్రమే వేదికగా నిలుస్తుంది. అలాంటి ప్రతిష్టాత్మక ప్రాంగణంలో ‘రామాయణ’ ప్రీమియర్ ప్రదర్శించడం భారతీయ సినిమా చరిత్రలోనే ఓ మైల్‌స్టోన్ ఘట్టం. ఈ ప్రీమియర్‌ను అత్యాధునిక 3D ఫార్మాట్‌లో ప్రదర్శించనున్నారు. మొత్తం 945 మంది కూర్చునే సామర్థ్యం ఉన్న డేవిడ్ గెఫెన్ థియేటర్‌లో హాలీవుడ్ ప్రముఖులు, గ్లోబల్ డైరెక్టర్లు, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు, ప్రముఖ టెక్నీషియన్ల సమక్షంలో ఈ స్క్రీనింగ్ జరగనుంది.


దీపావళి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ ప్రీమియర్ రెడ్ కార్పెట్‌కు హాజరయ్యే అంతర్జాతీయ ప్రముఖులను కూడా సంప్రదాయ భారతీయ పండుగ దుస్తులు ధరించి రావాలని ఆహ్వానించారు. దీంతో హాలీవుడ్ నడిబొడ్డున భారతీయ సంస్కృతి వెల్లివిరియనుంది. నితేష్ తివారీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ భారీ విజువల్ వండర్‌ను నమిత్ మల్హోత్రాకు చెందిన ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, DNEG, యశ్‌కు చెందిన మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆస్కార్ విన్నర్ ఏ.ఆర్. రెహమాన్, లెజెండరీ హాలీవుడ్ కంపోజర్ హాన్స్ జిమ్మర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 2026 నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా మొదటి పార్ట్ గ్రాండ్‌గా విడుదలకానుండగా.. 2027 దీపావళికి రెండో పార్ట్ ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలతో పాటు ఐమాక్స్ (IMAX) ఫార్మాట్‌లోనూ భారీ ఎత్తున విడుదల కానున్న ఈ చిత్రాన్ని గ్లోబల్ మార్కెట్‌లో ప్రముఖ సంస్థ సోనీ పిక్చర్స్ ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేయనుంది.

ఇవి కూడా చదవండి:

మనం ఎప్పుడూ భయపడకూడదు.. ఇచ్చిపడేయాలి: విశ్వక్‌సేన్

యంగ్ హీరోతో ‘ఓ పిట్టకథ’ దర్శకుడి చిత్రం ప్రారంభం

ముంబైలో సంచలనం.. హీరో టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. ఆ గ్యాంగ్ పనేనా?

Updated Date - Oct 18 , 2026 | 10:39 PM

Ramayana : రావణుడొచ్చాడు!

Ramayana - Arun Govil: తెరపై నటుడిని కాదు.. దేవుడినే చూస్తారు..

Ramayana Telugu Trailer: రామాయ‌ణ.. ట్రైల‌ర్ అదిరింది

Ramayana: 'రామాయణ్‌’పై ట్రోలింగ్‌ సద్గురు స్పందన..

Ramayana: ఈ సీత‌మ్మ‌పైనే.. ట్రోల్స్ ఎందుకు!