Bloody Romeo: ‘బ్లడీ రోమియో’.. క్రేజీ కాంబినేషన్ వర్కౌట్ అయినట్టేనా?
ABN , Publish Date - Aug 08 , 2026 | 09:45 AM
నాని ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’ చిత్రంతో బిజీగా ఉన్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా తర్వాత నాని చేయబోయే చిత్రం ‘బ్లడీ రోమియో’.
నాని ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’ చిత్రంతో బిజీగా ఉన్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా తర్వాత నాని చేయబోయే చిత్రం ‘బ్లడీ రోమియో’ (Bloody Romeo) సుజీత్ (Sujeeth) దర్శకుడు. ‘ఓజీ’ చిత్రం తర్వాత ఆయన్నుంచి వస్తున్న సినిమా కావడంతో సినిమా మొదలు కాకముందే అంచనాలు నెలకొన్నాయి. ‘ది ప్యారడైజ్’ షూటింగ్ పూర్తయ్యాక ఈ సినిమాపై దృష్టి పెట్టనున్నారు నాని. అక్టోబర్‌లో షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో నాని సరసన నటించబోయే హీరోయిన్ ఎవరనే చర్చ మొదలైంది. తాజా సమాచారం ప్రకారం ఈ అవకాశాన్ని భాగ్యశ్రీ బోర్సే (Bhagya sri Borse) అందుకొందని టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఆమెతో చర్చలు జరిపినట్లు సమాచారం. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇటీవల ‘లెనిన్’తో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న భాగ్యశ్రీ ఇది మంచి అవకాశమనే చెప్పాలి.
‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన భాగ్యశ్రీ తొలి సినిమాతోనే అందం, స్ర్కీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నారు. తదుపరి కింగ్‌డమ్, ఆఽంధ్రాకింగ్ తాలూక, కాంత, లెనిన్ చిత్రాల్లో వరుస అవకాశాలు అందుకున్నారు. ఈ చిత్రాల్లో సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా నటిగా భాగ్యశ్రీ ఎక్కడా ఫెయిల్ కాలేదు. తన వంతు న్యాయం చేసింది. తాజాగా వచ్చిన ‘లెనిన్’తో పెద్ద హిట్ అందుకున్నారు. ఇప్పుడు నాని ‘బ్లడీ రోమియో’లో హీరోయిన్‌గా ఎంపికేౖతే ఆమె కెరీర్‌కి మరో మంచి అవకాశం అందినట్లే.
ALSO READ:
Yash: యశ్ హీరోగా.. నిర్మాతగా.. ఇప్పుడు ఇంకోలా..
Niharika Konidela: బంగారు బోనమెత్తిన నిహారిక.. కోరిక తీరిందంటూ..