Prabhas: స్పిరిట్.. ఫౌజీ.. వాయిదా వెనక చాలా లెక్కలున్నాయ్..

ABN , Publish Date - Oct 19 , 2026 | 10:03 AM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి.  చిత్రీకరణలు సజావుగానే సాగుతున్నాయి..  కాకపోతే  సినిమాల విడుదల మాత్రం అనుకున్న సమయానికి జరగడం లేదు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) చేతిలో ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి.  చిత్రీకరణలు సజావుగానే సాగుతున్నాయి..  కాకపోతే  సినిమాల విడుదల మాత్రం అనుకున్న సమయానికి జరగడం లేదు. తాజాగా  ‘ఫౌజీ’, ‘స్పిరిట్’ (Spirit) చిత్రాల విడుదల తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.  

‘ఫౌజీ’ కోసం ‘స్పిరిట్’ వాయిదా?

హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ మొదట 2026 డిసెంబర్‌లో విడుదల చేయాలనీ భావించారు మేకర్స్. అయితే ఇప్పుడు ‘ఫౌజీ’ అనుకున్న తేదికి రావడం లేదు. ఈ సినిమా విడుదల 2027 మార్చికి వాయిదా పడినట్లు మేకర్స్ ప్రకటించారు. మరోవైపు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న‘స్పిరిట్’ 2027 మార్చి 5న విడుదల కావాల్సి ఉంది. అయితే ‘ఫౌజీ’ విడుదల మార్చికి మారితే, ఈ రెండు సినిమాల మధ్య పోటీ లేకుండా ఉండేందుకు ‘స్పిరిట్‌’ను 2027 అక్టోబర్‌కు వాయిదా వేయాలని భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

బిజినెస్ పరంగా కీలక నిర్ణయం?

ప్రభాస్ ఒకేసారి పలు సినిమాల్లో నటించడం వల్ల చిత్ర పరిశ్రమలోని వివిధ విభాగాలకు పని లభిస్తోంది. అయితే భారీ బడ్జెట్ చిత్రాల షూటింగ్ ఆలస్యమైతే నిర్మాణ వ్యయం పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే షూటింగ్ షెడ్యూల్స్‌తో పాటు విడుదల తేదీలను సమన్వయం చేయడం నిర్మాతలకు కీలకంగా మారుతోంది. ఒకే హీరో నటించిన భారీ చిత్రాలు తక్కువ వ్యవధిలో విడుదలైతే మార్కెట్, కలెక్షన్స్ పై ప్రభావం పడుతుందనేది వాస్తవం.  ‘ఫౌజీ’, ‘స్పిరిట్’ సినిమాల విషయంలోనూ ఈ అంశాలను దృష్టితో పెట్టుకునే నిర్మాతలు విడుదల తేదీలను మార్చినట్లు, రెండు సినిమా మధ్య డేట్ గ్యాప్..  బిజినెస్ లెక్కలు అన్ని చూసే నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలకు సంబందించిన అప్డేట్ ఇచ్చే అవకాశం ఉంది.  

 

Updated Date - Oct 19 , 2026 | 10:44 AM