సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

తారక్ మా పెద్దబ్బాయ్.. చరణ్ నా తమ్ముడు: కింగ్

ABN, Publish Date - Nov 10 , 2026 | 12:57 PM

కింగ్ అక్కినేని నాగార్జున సమర్పణలో రూపుదిద్దుకున్న చిత్రం ‘ఇట్లు అర్జున’. తాజాగా జరిగిన ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో కింగ్ నాగార్జున స్పీచ్ వైరల్ అవుతోంది.

Itllu Arjuna Pre Release Event

కింగ్ అక్కినేని నాగార్జున సమర్పణలో రూపుదిద్దుకున్న చిత్రం ‘ఇట్లు అర్జున’ (Itllu Arjuna). అనీష్ (Aniesh) హీరోగా పరిచయం అవుతుండగా, అనశ్వర రాజన్ (Answara Rajan) హీరోయిన్‌గా నటిస్తున్నారు. మహేష్ ఉప్పల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దర్శకుడు వెంకీ కుడుముల ఈ సినిమాతో వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ స్థాపించి, నిర్మాతగా ఎంట్రీ ఇస్తున్నారు. నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమైన ఈ చిత్ర ప్రమోషన్స్‌ను ఓ రేంజ్‌లో నిర్వహిస్తున్నారు. సోమవారం ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకకు కింగ్ నాగార్జున (King Nagarjuna), మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan), అఖిల్ అక్కినేని (Akhil Akkineni) ముఖ్య అతిథులుగా హాజరై యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.


ఇక ఈ కార్యక్రమంలో కింగ్ నాగార్జున స్పీచ్ వైరల్ అవుతోంది. మరీ ముఖ్యంగా తారక్, చరణ్‌ల గురించి ఆయన మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. రామ్ చరణ్ గురించి ప్రస్తావిస్తూ.. ‘మా ఇద్దరి మధ్య ఎలాంటి అనుబంధాలు ఉన్నాయో చెప్పడం కష్టం. తను నన్ను అన్న అని పిలుస్తాడు. కాబట్టి.. చరణ్ నాకు తమ్ముడు’ అని అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘‘కొత్తదనాన్ని ఎప్పుడూ ఆహ్వానించే తెలుగు సినిమా ప్రేక్షకులకు థాంక్యూ. ఈ వేడుకకు వచ్చిన రామ్ చరణ్‌కు థాంక్యూ. తను చాలా హంబుల్ పర్సన్. మా పెద్దబ్బాయి తారక్ (Tarak) ఇక్కడికి రాలేకపోయాడు కానీ, తను ఈ సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేసి, యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపాడు. థాంక్యూ తారక్.

అనీష్ గ్లింప్స్ తీసుకొచ్చి వాయిస్ ఓవర్ చెప్పమని అడిగాడు. తను ఈ సినిమాలో మూగవాడిగా నటిస్తున్నాడు. తొలి సినిమాకే ఇలాంటి ఛాలెంజింగ్ రోల్ చేయడం అవసరమా? అని అడిగాను. రామ్ చరణ్ ఒక చెవిటి పాత్ర చేయడానికి పదేళ్లు పట్టింది. అఖిల్ ఆరో సినిమాకు బ్లైండ్ పాత్ర చేశాడు. మొదటి సినిమాకే ఇలా చేస్తున్నాడంటే.. ‘ఇట్లు అర్జున’ కథ మీద అనీష్‌కు చాలా నమ్మకం ఉంది. నాకు సినిమా చూపించారు. సినిమా చూసి సర్‌ప్రైజ్ అయ్యాను. అనీష్ అద్భుతంగా తన పాత్రలో లీనమయ్యాడు. సినిమా చాలా బాగుంది. తను కళ్లతోనే మాట్లాడాడు. తన సైలెన్స్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. అద్భుతంగా పెర్ఫార్మ్ చేశాడు. అనీష్, అనశ్వర కెమిస్ట్రీ సినిమాలో చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది.


ఇంకా తమన్ ఇచ్చిన ప్రతి పాట హిట్ అయింది. నవంబర్ 13న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అనీష్ ప్రేమ మీ అందరికీ వినిపిస్తుంది. ఈ సినిమాను ప్రెజెంట్ చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. నేను చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

మూడోసారి విడాకులు?.. పవన్ కళ్యాణ్ మరో యుద్ధం చేయాల్సిందే

సూర్య నెక్ట్స్ ప్రాజెక్ట్‌కు టైటిల్ ఫిక్స్.. మరో హిట్ రాసిపెట్టుకోండమ్మా

విజయ్ సేతుపతి జైత్రయాత్ర.. వరుస రిలీజ్‌లతో ఫుల్ బిజీ

Updated Date - Nov 10 , 2026 | 12:57 PM