Itllu Arjuna Teaser: ఈ నగరానికి కొత్త పోరడొచ్చినాడే..
ABN , Publish Date - Sep 19 , 2026 | 05:23 PM
కొత్త కుర్రాడు అనీష్ కృష్ణ, అనస్వర రాజన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సరికొత్త చిత్రం ఇట్లు అర్జున. మహేష్ ఉప్పాల దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రసిద్ధ దర్శకుడు వెంకీ కుడుముల సమర్పణలో వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించింది.
కొత్త కుర్రాడు అనీష్ కృష్ణ (Aniesh Krishna), అనస్వర రాజన్ (Anaswara Rajan) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సరికొత్త చిత్రం ఇట్లు అర్జున (Itlu Arjuna). మహేష్ ఉప్పాల దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రసిద్ధ దర్శకుడు వెంకీ కుడుముల సమర్పణలో వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించింది. ఇక ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఎస్ సంగీతం అందించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఇట్లు అర్జున టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.
టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అర్జున్ ఒక మూగవాడు. అతను ఏం చెప్పినా ఎవరికి అర్ధం కాదు. అర్జున్ కి తన అపార్ట్మెంట్ లో ఉండే కీర్తి అంటే చాలా ఇష్టం. ఆమెని కలవాలని, మాట్లాడాలని చాలా ప్రయత్నిస్తాడు. కానీ, తనకు మాటలు రాని కారణంగా కీర్తి దగ్గరకు వెళ్లలేకపోతాడు. అయితే అనుకోకుండా కీర్తినే.. అర్జున్ తో ప్రేమలో పడుతుంది. ఎవరికి ఎంత చెప్పినా అర్ధం కానీ అర్జున్ సైగలు.. ఆమె వెంటనే అర్ధం చేసుకుంటుంది. ఇక ఈ క్యూట్ లవ్ స్టోరీలోకి విలన్స్ ఎంటర్ అవ్వడం.. అర్జున్ - కీర్తి వెనుక పడడం.. చివరికి మూగవాడైన అర్జున్ ఏం చేశాడు.. ? అనేది కథగా తెలుస్తోంది.
ప్రేమ, ఎమోషన్స్‌తో పాటు యాక్షన్, కామెడీ ఎలిమెంట్స్‌ని కూడా సరిసమానంగా మేళవించినట్లు టీజర్ విజువల్స్ స్పష్టం చేస్తున్నాయి. హీరో అనీష్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా ఎనర్జిటిక్‌గా ఉండగా, అనస్వర రాజన్ తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంది. ఎస్. తమన్ అందించిన నేపథ్య సంగీతం టీజర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. అక్టోబర్ 30న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. మరి నగరంలోకి వచ్చిన కొత్త పోరడు ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
ఇవి కూడా చదవండి:
Chiranjeevi: చిరంజీవి నన్ను చెప్పుతో కొట్టినా ఫీలవ్వను.. కానీ అందుకు ఫీలయ్యా
‘డ్రాగన్’.. సెట్స్‌లోకి ఎన్టీఆర్ ఎంటరయ్యేది ఎప్పుడంటే
గ్యాంగ్‌స్టర్ డ్రామానే కాదు.. ‘దాదా’లో అసలు హైలైట్ అదే!