Breaking: షాకింగ్: పవన్ కల్యాణ్, అన్నా కొణిదెల విడాకులు
ABN , Publish Date - Nov 10 , 2026 | 05:31 AM
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధిపతి, సినీ నటుడు పవన్ కల్యాణ్... ఆయన సతీమణి అన్నా లెజినోవా తమ వివాహ బంధానికి ముగింపు పలికారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధిపతి, సినీ నటుడు పవన్ కల్యాణ్ ( Pawan Kalyan)... ఆయన సతీమణి అన్నా లెజినోవా (Anna Lezhneva) తమ వివాహ బంధానికి ముగింపు పలికారు. దీనిపై సోమవారం రాత్రి ఉమ్మడిగా ఒక ప్రకటన విడుదల చేశారు. 'మా శ్రేయోభిలాషులు.. సన్నిహితులకు..' అంటూ పవన్ కల్యాణ్ కొణిదెల, అన్నా కొణిదెల పేర్లతో ఈ ప్రకటన వెలువడింది.
'మా జీవితంలో ముఖ్యమైన భాగాన్ని కలిసి గడిపాం. ఇప్పుడు పరస్పర అవగాహన, గౌరవంతో విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మా వైవాహిక జీవితం ముగిసినప్పటికీ.. మంచి స్నేహితులుగా, మా పిల్లలకు మంచి తల్లిదండ్రులుగా కొనసాగుతాం. మా పిల్లల ఆనందం, శ్రేయస్సు ఎప్పటికీ మా ఉమ్మడి ప్రాధాన్యాల్లో భాగంగా ఉంటుంది. మా వ్యక్తిగత జీవితంలో జరుగుతున్న మార్పు ఇది. దీనిని అర్థం చేసుకుంటారని, మా ప్రైవసీని గౌరవిస్తారని ఆశిస్తున్నాం.

మా ప్రయాణంలో తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ హృదయ పూర్వక కృతజ్ఞతలు' అని ఆ ప్రకటనలో తెలిపారు. పవన్ కల్యాణ్‌కు ఇది మూడో వివాహం. ఆయన సినీరంగ ప్రవేశం తర్వాత ఒక యువతిని పెళ్లాడారు. కొన్నేళ్లకు వారు విడిపోయారు. ఆ తర్వాత 2009లో నటి రేణూ దేశాయ్‌ని పెళ్లాడారు. వీరు కూడా పరస్పర అవగాహనతో విడిపోయారు. 2013లో రష్యాకు చెందిన అన్నా లెజీనోవాను పవన్ పెళ్లాడారు.