మూడోసారి విడాకులు?.. పవన్ కళ్యాణ్ మరో యుద్ధం చేయాల్సిందే

ABN , Publish Date - Nov 10 , 2026 | 12:14 PM

సోషల్ మీడియా వేదికగా పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి తరచూ రకరకాల వార్తలు, ఊహాగానాలు చక్కర్లు కొడుతుండటం కొత్తేమీ కాదు. తాజాగా ఆయన తన మూడో భార్యకు కూడా విడాకులు ఇస్తున్నట్లుగా ఓ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Power Star Pawan Kalyan

సోషల్ మీడియా వేదికగా పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వ్యక్తిగత జీవితానికి సంబంధించి తరచూ రకరకాల వార్తలు, ఊహాగానాలు చక్కర్లు కొడుతుండటం కొత్తేమీ కాదు. అయితే తాజాగా ఆయన మూడో భార్య అనా కొణిదెల (Anna Konidela)తో విడిపోతున్నారంటూ నెట్టింట మళ్లీ కొన్ని ప్రచారాలు జోరందుకున్నాయి. ఎలాంటి అధికారిక స్పష్టత లేనప్పటికీ, నెట్టింట సాగుతున్న ఈ ప్రచారం జనసైనికులను, మెగా అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ఎవరి వ్యక్తిగత జీవితంలోనైనా తెరవెనుక ఏం జరుగుతుందనేది వారి అంతరంగాలకు మాత్రమే పరిమితం. కానీ రాజకీయంగా అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రజాక్షేత్రంలో కీలకంగా మారిన సమయంలో ఇలాంటి అంశాలు మళ్లీ తెరపైకి రావడం.. నిజంగా ఇది ఆయనకు ఓ పెద్ద పరీక్షా సమయమనే చెప్పాలి.


దశాబ్ద కాలంగా రాజకీయాల్లో ఎన్నో కష్టాలు, ఓటములు, వ్యక్తిగత విమర్శలు, అవమానాలు.. ఇలా అన్నింటినీ భరించి పవన్ కళ్యాణ్ నిలబడ్డారు. ఎన్నో త్యాగాలు చేసి ఇప్పుడిప్పుడే జనసేన పార్టీ (Janasena Party)ని నిలబెడుతూ, ఎంపీల నుంచి స్థానిక ప్రజాప్రతినిధుల వరకు పార్టీ జెండాను రెపరెపలాడిస్తూ ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతున్నారు. ప్రజా నాయకుడిగా ప్రజల నమ్మకాన్ని చూరగొంటున్న ఈ దశలో.. ప్రత్యర్థులు ఆయన విధానాల కంటే ఎక్కువగా ఆయన వ్యక్తిగత జీవితాన్ని, గత పెళ్లిళ్లను ప్రస్తావిస్తూ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి ప్రయత్నించడం గతంలోనూ చూశాం. ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో ఇలాంటి ప్రచారాలు ఊపందుకుంటే, రాజకీయ ప్రత్యర్థులు దీన్ని మరోసారి విమర్శల అస్త్రంగా మార్చుకునే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది.


అయితే ఏ వ్యక్తి అయినా కావాలని తమ వ్యక్తిగత జీవితంలో క్లిష్ట పరిస్థితులను కోరుకోరు. ప్రజా జీవితంలో ఉన్న నాయకులకు వ్యక్తిగత సంఘర్షణలు ఎదురైతే వాటిని తట్టుకోవడం మరింత కష్టతరం. పవన్ కళ్యాణ్ వంటి భావోద్వేగపూరితమైన నాయకుడికి ఇలాంటి ప్రచారాలు మానసికంగా ఎంతో బాధను కలిగిస్తాయన్నది వాస్తవం. ప్రజలు ఆయన రాజకీయాన్ని, ఆయన ఆశయాలను విశ్వసిస్తున్న తరుణంలో.. ఈ సోషల్ మీడియా ట్రోలింగ్‌ను ఆయన, ఆయన అభిమానులు ఎలా ఎదుర్కొంటారనేది కీలకంగా మారింది. గతంలో ఎన్నో కష్టాలను దాటుకుని ఫీనిక్స్ పక్షిలా ఎదిగిన పవన్ కళ్యాణ్.. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతూ ఈ ప్రతికూల ప్రచారాలన్నింటినీ దాటుకుని తన రాజకీయ ప్రస్థానాన్ని మరింత బలంగా ఎలా ముందుకు నడిపిస్తారో వేచి చూడాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

సూర్య నెక్ట్స్ ప్రాజెక్ట్‌కు టైటిల్ ఫిక్స్.. మరో హిట్ రాసిపెట్టుకోండమ్మా

విజయ్ సేతుపతి జైత్రయాత్ర.. వరుస రిలీజ్‌లతో ఫుల్ బిజీ

సినీ తారల ఇళ్లలో దీపావళి సందడి.. వర్షంలోనూ ఫ్యాన్స్ తగ్గేదేలే

Updated Date - Nov 10 , 2026 | 12:22 PM

Pawan Kalyan : స్నేహపూర్వక ప్రవర్తన.. మనసును కదిలించింది

Anna Konidela: నెటిజన్ల చిలిపి ప్రశ్నలు.. సరైన సమాధానాలు

Anna Konidela: మూగజీవాల కోసం పుట్టినరోజున కానుక

Breaking: షాకింగ్‌: పవన్ కల్యాణ్, అన్నా కొణిదెల విడాకులు

Pawan Kalyan Record: టాక్‌ ఆఫ్‌ ది ఇంటర్‌నెట్‌!