సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘చిరంజీవి’కి మెగా బ్రదర్ నాగబాబు సపోర్ట్

ABN, Publish Date - Apr 13 , 2026 | 03:40 PM

చిరంజీవికి మెగా బ్రదర్ నాగబాబు సపోర్ట్ అనగానే, తన అన్నయ్యకి నాగబాబు సపోర్ట్ చేసేంత ఏముందా? అని ఆశ్చర్యపోవద్దు. అసలు విషయం తెలిస్తే.. ఇదా సంగతి! అని అంతా అనుకుంటారు.

Chiranjeevi First Look Launch

చిరంజీవి (Chiranjeevi)కి మెగా బ్రదర్ నాగబాబు (Mega Brother Nagababu) సపోర్ట్ అనగానే, తన అన్నయ్యకి నాగబాబు సపోర్ట్ చేసేంత ఏముందా? అని ఆశ్చర్యపోవద్దు. ఇక్కడ ‘చిరంజీవి’ అంటే మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) కాదు. కికు యనమల, కశిష్ ఖాన్ జంటగా నటిస్తున్న సినిమా పేరు ‘చిరంజీవి’. ఈ సినిమాకే మెగా బ్రదర్ నాగబాబు సపోర్ట్ అందించారు. కికు ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సాయి వెంకట్ (Sai Venkat) దర్శకత్వంలో దీప్తి నడిమింటి నిర్మిస్తున్న చిత్రం ‘చిరంజీవి’. తనికెళ్ల భరణి, ఈశ్వరీ రావు, గోపరాజు రమణ, శ్రీకాంత్ భరత్, వైవా రాఘవ వంటివారు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా.. వేసవి విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్ర టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మెగా బ్రదర్ నాగబాబు చేతుల మీదుగా టీమ్ విడుదల చేయించారు.


ఈ పోస్టర్‌ను విడుదల చేసిన అనంతరం టైటిల్ లుక్ చాలా బాగుందని, సినిమా ఘన విజయం సాధించాలని నాగబాబు చిత్రయూనిట్‌ను ఆశీర్వదించారు. తమ చిత్ర ఫస్ట్ లుక్‌ని లాంఛ్ చేసిన నాగబాబుకు చిత్ర బృందం కృతజ్ఞతలు తెలిపారు. డెక్స్ట్రోకార్డియా (కుడివైపు గుండె ఉండే అరుదైన పరిస్థితి)తో ఉండే చిరు అనే యువకుడు తన జీవితంలో ఎదురైన సంఘర్షణలను, సవాళ్లను, అరుదైన పరిస్థితిని ఎలా తట్టుకుని నిలబడ్డాడు? తను అనుకున్న వాటిని ఎలా సాధించాడు? అనేది ఈ చిత్ర కథాంశమని చిత్రయూనిట్ తెలిపింది.


ఆద్యంతం ఇంట్రెస్టింగ్‌గా, ఇన్స్‌పైరింగ్‌గా దర్శకుడు సాయి వెంకట్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని, ప్రేక్షకులను ఎంగేజ్ చేసే అన్ని ఎలిమెంట్స్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని సమ్మర్‌కు రిలీజ్ చేయబోతున్నామని నిర్మాత దీప్తి నడిమింటి తెలిపారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌తో పాటు ఇతర వివరాలను తెలియజేస్తామని ఈ సందర్భంగా ఆమె చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

సింగర్ మంగ్లీ కేసులో ట్విస్ట్.. ఇదంతా బిగ్‌బాస్ కోసమేనా?

లెజెండరీ సింగర్ ఆశా భోంస్లే మృతి.. ప్రముఖుల నివాళులు

ఎం.ఎస్. రాజు రూటు మార్చారు.. ఈసారి నో ఫీలింగ్స్!

Chiranjeevi: చిరంజీవికి తప్పని వెయిటింగ్.. ఈ అడ్డంకులేంటి?

Venu Udugula: మంగ్లీ ఘటనతో నాకు ఎలాంటి సంబంధం లేదు

UBS OTT: ఉస్తాద్ ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు.. స్ట్రీమింగ్ వివరాలివే!

Updated Date - Apr 13 , 2026 | 03:44 PM