Nagababu: ఈ పండుగ చాలా మెమ‌ర‌బుల్.. ఎమోష‌నల్ అయిన‌ నాగ‌బాబు! మెగా ఫ్యామిలీ ఫొటోస్‌ వైర‌ల్‌

ABN , Publish Date - Jan 16 , 2024 | 08:59 PM

మెగాస్టార్ ఇంట సంక్రాంతి సంబురాలు బెంగళూరులోని ఫాం హౌస్‌లో రెండు రోజుల పాటు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ రోజు నాగబాబు కొన్ని ఫొటోలను షేర్ చేస్తూ ఎమోష‌నల్ అయ్యారు.

Nagababu: ఈ పండుగ చాలా మెమ‌ర‌బుల్.. ఎమోష‌నల్ అయిన‌ నాగ‌బాబు! మెగా ఫ్యామిలీ ఫొటోస్‌ వైర‌ల్‌
nagababu,chiranjeevi

మెగాస్టార్ ఇంట సంక్రాంతి సంబురాలు బెంగళూరులోని ఫాం హౌస్ లో రెండు రోజుల పాటు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకల్లో పవన్ కల్యాణ్ మినహా కుటుంబ సభ్యులంతా పాల్గొన్నారు. ఈ మేరకు నిన్న ఫ్యామిలీ ఫొటో సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ద్వారా అభిమానులతో పంచుకోగా నాగబాబు (NagaBabu) ఈ రోజు మరి కొన్ని ఫొటోలను షేర్ చేస్తూ ఎమోష‌నల్ అయ్యారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండుగలు కుటుంబాల మధ్య మనుషుల మధ్య ఐక్యతను పెంపొందిస్తాయని, నా హఈ హృదయానికి అత్యంత దగ్గరైన మనషుల సమక్షంలో ఈ పండుగను జరుపుకోవడం చెప్పలేనంత ఆనందాన్ని నింపిందని ఇది నా జీవితంలో మధుర జ్ఞాపకంగా నిలిచి ఉంటుందన్నారు. ఈ పోస్టును చిరంజీవి(Chiru), వరుణ్ తేజ్ (VarunTej), లావణ్య (lavanya), నిహారిక (Niharika)లకు ట్యాగ్ చేశారు.

ఈ ఫొటోల్లో చిరంజీవి, నాగ‌బాబు, రామ్‌చ‌ర‌ణ్‌, వ‌రుణ్ తేజ్‌, లావ‌ణ్య‌, నిహారిక‌, అఖిరా నంద‌న్‌, ఆధ్య‌, అల్లు శిరీష్‌,అల్లు అర‌వింద్ ఉన్నారు.

Updated Date - Jan 16 , 2024 | 09:08 PM