సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘వృషకర్మ’ పోస్టర్‌లో డివైన్ వైబ్స్.. నాగచైతన్య ఇంటెన్స్ లుక్ అదుర్స్

ABN, Publish Date - Oct 21 , 2026 | 09:16 PM

‘విరూపాక్ష’ వంటి సస్పెన్స్ మిస్టికల్ బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడు కార్తీక్ దండు తెరకెక్కిస్తోన్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వృషకర్మ’. ఈ మూవీ నుంచి దసరా స్పెషల్‌గా విడుదలైన పోస్టర్ వైరల్ అవుతోంది.

Vrushakarma Movie

‘విరూపాక్ష’ వంటి సస్పెన్స్ మిస్టికల్ బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడు కార్తీక్ దండు (Karthik Dandu) తెరకెక్కిస్తోన్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వృషకర్మ’ (Vrushakarma). యువ సామ్రాట్ నాగచైతన్య (Naga Chaitanya) హీరోగా నటిస్తోన్న ఈ మైథలాజికల్ థ్రిల్లర్‌పై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (SVCC) బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా, సుకుమార్ రైటింగ్స్ భాగస్వామ్యం వహిస్తోంది. బాపినీడు సమర్పణలో, ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సహ నిర్మాణంలో ఈ చిత్రం రూపొందుతోంది. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని విడుదల చేసిన ప్రత్యేక పోస్టర్ (Dussehra Special Poster) సినీ ప్రియులను బాగా ఆకట్టుకుంటోంది.


విడుదలైన పోస్టర్ ఆద్యంతం ఆధ్యాత్మిక వాతావరణాన్ని, రహస్య భరితమైన ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఇందులో నాగచైతన్య గుబురు గడ్డం, నుదుటిన ఎర్రటి బొట్టుతో తీక్షణంగా చూస్తూ.. ఎంతో పవర్‌ఫుల్ అండ్ ఇంటెన్స్ అవతార్‌లో కనిపిస్తున్నారు. ఆయన ముఖంలో సగభాగం నీడలో ఉండటం పాత్ర వెనుక దాగి ఉన్న సరికొత్త కోణాన్ని సూచిస్తోంది. చైతూ ముందు సంప్రదాయ ఆభరణాలు, ఎరుపు-బంగారు వర్ణపు చీరతో అలంకరించిన దేవతా విగ్రహం ప్రధాన ఆకర్షణగా నిలవగా, ఆ విగ్రహం చేతిలోని బంగారు శూలం ఆధ్యాత్మికతను ప్రతిబింబిస్తోంది. అగ్నిని తలపించే ఎరుపు రంగు కాంతులు, బంగారు మెరుపుల కలయిక పోస్టర్‌కు ఒక రకమైన డివైన్ పవర్‌ను తీసుకొచ్చాయి.


నాగచైతన్య సినీ ప్రస్థానంలోనే అత్యధిక వ్యయంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆయన పూర్తిగా సరికొత్త మేకోవర్‌తో ప్రేక్షకులను మెప్పించనున్నారు. ఇందులో చైతూ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా, స్పర్శ్ శ్రీవాస్తవ విలన్ పాత్రలో కనిపించనున్నారు. సీనియర్ నటుడు జయరామ్, బేబీ కియారా ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ‘కాంతార’ ఫేమ్ అజనీష్ బి. లోక్‌నాథ్ సంగీతం అందిస్తుండగా, రాగుల్ డి. హెరియన్ సినిమాటోగ్రఫీ, శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైన్, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ ముగింపు దశకు చేరుకోగా, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. ఈ మైథలాజికల్ థ్రిల్లర్‌ను 2026 డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం రిలీజైన పోస్టర్ చూస్తుంటే చైతూ ఖాతాలో మరో భారీ హిట్ ఖాయంగా కనిపిస్తోంది. చూద్దాం మరి.. ఏం జరుగుతుందో..

ఇవి కూడా చదవండి:

రగ్గడ్ లుక్‌లో రామ్ చరణ్.. ‘RC17’ స్క్రిప్ట్ రీడింగ్‌లో.. పిక్ వైరల్

నవ్వుల రాబరీ మొదలైంది.. హిలేరియస్‌గా ‘దొంగ నా కొడుకు’ టీజర్

తల లేని మొండెంతో.. ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్ అదిరింది

Updated Date - Oct 21 , 2026 | 09:16 PM