రగ్గడ్ లుక్‌లో రామ్ చరణ్.. ‘RC17’ స్క్రిప్ట్ రీడింగ్‌లో.. పిక్ వైరల్

ABN , Publish Date - Oct 21 , 2026 | 08:48 PM

‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, లెక్కల మాస్టారు సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతోన్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ ‘RC17’. ఈ మూవీ స్క్రిప్ట్ చదువుతూ ఉన్న చరణ్ పిక్ వైరలవుతోంది.

Ram Charan

‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan), లెక్కల మాస్టారు సుకుమార్ (Sukumar) కాంబినేషన్‌లో రాబోతోన్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ ‘RC17’. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) ఈ పాన్ ఇండియా చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేసిన మేకర్స్, ఈ సినిమాను అక్టోబర్ 26 లేదా 27న పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


ఈ చిత్రంలో తన పాత్ర కోసం రామ్ చరణ్ పూర్తిగా సరికొత్త మేకోవర్‌లోకి మారుతున్నారు. ఇందులో భాగంగానే ఆయన జుట్టు పెంచి పోనీటైల్ లుక్‌తో కనిపిస్తుండగా, తాజాగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్విమ్మింగ్ పూల్ పక్కన పచ్చని ప్రకృతి ఒడిలో కూర్చొని.. బ్లూ స్వెట్‌షర్ట్, డెనిమ్ జీన్స్, కళ్లజోడుతో రగ్గడ్ అండ్ క్లాస్ లుక్‌లో చరణ్ దర్శనమిచ్చారు. టేబుల్‌పై కాఫీ కప్పుతో పాటు చేతిలో ఉన్న స్క్రిప్ట్ పేపర్లను ఆయన శ్రద్ధగా చదువుతుండటం చూస్తుంటే, సుకుమార్ ప్రాజెక్ట్ కోసమే చరణ్ తీవ్రంగా కసరత్తులు చేస్తున్నారని స్పష్టమవుతోంది.


ఇక ఈ భారీ చిత్రంలో కథానాయికగా ఎవరు నటించనున్నారనే అంశంపై టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చ సాగుతోంది. తొలుత ‘ధురంధర్’ ఫేమ్ సారా అర్జున్ పేరు దాదాపు ఖరారైనట్లు ప్రచారం జరిగినప్పటికీ, ఆమె ఇంకా అధికారికంగా సైన్ చేయలేదని తెలుస్తోంది. మరోవైపు ‘సయ్యారా’ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న యువ నటి అనీత్ పడ్డా పేరును కూడా చిత్రబృందం పరిశీలిస్తున్నట్లు సమాచారం. రామ్ చరణ్ పూర్తి లుక్‌తో పాటు హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలపై సినిమా లాంచ్ రోజు మరింత స్పష్టత రానుంది.

ఇవి కూడా చదవండి:

నవ్వుల రాబరీ మొదలైంది.. హిలేరియస్‌గా ‘దొంగ నా కొడుకు’ టీజర్

తల లేని మొండెంతో.. ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్ అదిరింది

పెద్ద సినిమాలు ఉన్నప్పుడు చిన్న సినిమాలు వస్తే.. జరిగేది ఇదే

Updated Date - Oct 21 , 2026 | 08:48 PM

RC17 Update: చరణ్, సుక్కు సినిమా మొదలయ్యేది అప్పుడేనా..

RC17: కొత్త ఆఫీస్ పూజా కార్యక్రమాలు పూర్తి

RC17 కోసం రామ్ చరణ్ షాకింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్

RC17: చరణ్, సుక్కు మూవీ.. స్టార్ట్ కాకుండానే డెడ్‌లైన్!

RC17 - Rajamouli: సుకుమార్‌ - రామ్‌చరణ్‌ ఆ సీన్  ఎలా ఉండబోతోందంటే..!