‘AK47’ రెండో పాట ‘మాలా’ వచ్చేసింది.. నివేదా పేతురాజ్‌ని చూడాల్సిందే
ABN , Publish Date - Oct 19 , 2026 | 06:59 PM
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రూపొందుతున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47’. ఈ మూవీ నుంచి సెకండ్ సాంగ్‌ని మేకర్స్ వదిలారు.
విక్టరీ వెంకటేష్ (Victory Venaktesh), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబోలో రూపొందుతున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47’ (Aadarsha Kutumbam House No 47). వాస్తవానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. కానీ, వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. మరి ఎప్పుడు విడుదల అనేది ఇంకా మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు. ఈలోపు సినిమాపై హైప్ పెంచేందుకు మ్యూజిక్ ప్రమోషన్స్ మొదలెట్టి, ఇటీవలే ఫస్ట్ సింగిల్ ‘నారాయణమ్మ’ను వదిలారు. ఆ సాంగ్ మంచి స్పందనను రాబట్టుకుంటోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ నుంచి రెండో సాంగ్ ‘మాలా’ (Maala Lyrical Video) ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థమన్ ఎస్ స్వరపరిచిన ఈ పాట వైవిధ్యమైన సంగీతంతో, రంగులమయమైన దృశ్యాలతో, ఉత్సాహభరితమైన నృత్యాలతో ఆకట్టుకుంటోంది.
ఈ పాటలో విక్టరీ వెంకటేష్, నివేదా పేతురాజ్ తమదైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో సందడి చేశారు. వీరిద్దరి కెమిస్ట్రీ, హుషారైన స్టెప్పులు, ఉత్సాహభరితమైన అభినయం పాటకు మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పాటలోని జోష్‌కు తగినట్లుగా రూపొందించిన విజువల్స్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. మరి ముఖ్యంగా నివేదా పేతురాజ్ ఈ పాటలో తన పరువాలతో ఆకట్టుకుంటోంది. ఈ పాటను ఆమె కోసమైనా చూడాల్సిందే.. అనేంతగా ఆమె ఈ పాటలో కనిపిస్తున్నారు.
ఇక ఈ పాటను తమన్ ఎస్, ధనుంజయ్ సీపాన, రణినా రెడ్డి ఆలపించగా.. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం సమకూర్చారు. భాను మాస్టర్ కొరియోగ్రఫీలో ఈ పాట రూపుదిద్దుకుంది. విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వస్తున్న ఈ చిత్రం భావోద్వేగాలు, వినోదం, కుటుంబ అనుబంధాలతో కూడిన సంపూర్ణ కుటుంబ కథాచిత్రంగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. శ్రీమతి మమత సమర్పిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
‘రౌడీ అల్లుడు’కు 35 ఏళ్ళు.. గీతా ఆర్ట్స్‌లో సంబరాలు
టాలీవుడ్ మేకర్స్‌పై రాహుల్ రామకృష్ణ సెటైరికల్ పోస్ట్
తలైవర్ మ్యాజిక్కే వేరు: ‘జైలర్ 2’ సక్సెస్‌పై నెల్సన్