నవ్వుల రాబరీ మొదలైంది.. హిలేరియస్‌గా ‘దొంగ నా కొడుకు’ టీజర్

ABN , Publish Date - Oct 21 , 2026 | 08:12 PM

మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో రూపొందుతోన్న క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘దొంగ నా కొడుకు’. యూట్యూబ్ స్టార్, ‘లిటిల్ హార్ట్స్’ ఫేమ్ మౌళి తనూజ్ ప్రశాంత్ హీరోగా నటిస్తుండగా, శ్రీను కంబాల ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

Donga Na Koduku Teaser

స్టార్ హీరోలతో భారీ పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్లు నిర్మిస్తూనే.. మరోవైపు కాన్సెప్ట్ ఓరియెంటెడ్, వినోదాత్మక చిత్రాలను ప్రోత్సహించడంలో టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా ఈ సంస్థ సమర్పణలో రూపొందుతోన్న క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘దొంగ నా కొడుకు’. యూట్యూబ్ స్టార్, ‘లిటిల్ హార్ట్స్’ ఫేమ్ మౌళి తనూజ్ ప్రశాంత్ హీరోగా నటిస్తుండగా, శ్రీను కంబాల ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేయగా, తాజాగా మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తోంది.

టీజర్ విషయానికి వస్తే.. ఈశ్వర్ (మౌళి) బీటెక్ చదువును మధ్యలోనే ఆపేసిన ఓ విచిత్రమైన కుర్రాడు. సముద్రం ఒడ్డున నిలబడి ‘‘దేవుడా.. మంచి తల్లిదండ్రులను ఇచ్చావ్, బెస్ట్ ఫ్రెండ్‌ని ఇచ్చావ్, అందమైన గర్ల్‌ఫ్రెండ్‌ని ఇచ్చావ్.. కానీ వచ్చే జన్మలో వీళ్లెవరూ వద్దు.. కేవలం డబ్బే కావాలి!’’ అని దేవుడిని కోరుకోవడంతో టీజర్ ఫన్నీగా మొదలైంది. జీవితంలో ఏదైనా సాధించాలి అంటే ఏం చేయాలన్నప్పుడు.. ‘‘మనం చనిపోయాక పది మంది అయినా ఏడవాలి సార్.. అందుకే ఆ పది మంది దగ్గర అప్పు చేశా, ఆల్రెడీ నలుగురు ఏడవడం మొదలెట్టారు!’’ అంటూ గుండు సుదర్శన్‌తో హీరో చెప్పే డైలాగ్ కితకితలు పెట్టిస్తుంది. చివర్లో ‘‘మీకు డబ్బే ముఖ్యమా? కన్న కొడుకు ముఖ్యమా?’’ అని ఈశ్వర్ అడగ్గానే.. తల్లిదండ్రులుగా నటించిన అలీ, రజిత ఇద్దరూ ముక్తకంఠంతో ‘‘డబ్బే ఇంపార్టెంట్!’’ అని తేల్చి చెప్పడం టీజర్‌కే హైలైట్. ఇక చివరిలో బీచ్‌లో హీరోయిన్‌తో కలిసి చేసే ‘టిఫిన్’ సీన్‌తో టీజర్‌ను మరింత ఫన్నీగా ముగించారు. క్రైమ్, రాబరీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథాంశానికి హిలేరియస్ కామెడీ జోడించడంతో సినిమాపై ఆసక్తి రెట్టింపైంది.


తనదైన బాడీ లాంగ్వేజ్, నేచురల్ డైలాగ్ డెలివరీతో మౌళి మరోసారి అలరించారు. హీరోయిన్‌గా సుష్మిత శెట్టి ఫ్రెష్ లుక్‌తో ఆకట్టుకోగా.. చాలాకాలం తర్వాత అలీ, రజిత కాంబినేషన్ స్క్రీన్‌పై కనిపించి మంచి వినోదాన్ని పంచింది. రఘుబాబు, ప్రియ, గుండు సుదర్శన్ కీలక పాత్రల్లో కనిపించారు. సింజిత్ ఎర్రంమిల్లి అందించిన నేపథ్య సంగీతం టీజర్‌కు మంచి ఫన్ వైబ్‌ను ఇచ్చింది. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం నవంబర్ 13న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. టీజర్ చూస్తుంటే మైత్రీ మూవీ మేకర్స్ ఖాతాలో మరో డీసెంట్ కామెడీ ఎంటర్‌టైనర్ చేరేలాగే కనిపిస్తోంది.


ఇక ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో మౌళి మాట్లాడుతూ.. ‘‘మా నిర్మాతలు రవి, నవీన్‌లకు హృదయపూర్వక ధన్యవాదాలు. కథను నమ్మి మొదటి నుంచి మాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. దర్శకుడు శ్రీను కంబాల నన్ను నమ్మి ఇంత అద్భుతమైన కథను అందించారు. ఈ కథ నచ్చగానే అలీ, రజిత వంటి సీనియర్ నటులు ఇందులో నటించడానికి ఒప్పుకోవడం మాకు కొండంత బలాన్నిచ్చింది. సింజిత్ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు, టెక్నికల్ టీమ్ అంతా బెస్ట్ ఔట్‌పుట్ ఇచ్చారు. కుటుంబంతో కలిసి థియేటర్లలో కడుపుబ్బా నవ్వుకోవాలని ఈ సినిమా చేశాం. ఖచ్చితంగా అందరూ నవ్వుతూ ఎంజాయ్ చేసి బయటకు వస్తారు.. ఇది నా గ్యారెంటీ’’ అని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

తల లేని మొండెంతో.. ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్ అదిరింది

పెద్ద సినిమాలు ఉన్నప్పుడు చిన్న సినిమాలు వస్తే.. జరిగేది ఇదే

హద్దుల్లో ఉండండి: బాడీ షేమింగ్ ట్రోలర్స్‌పై పాయల్ రాజ్‌పుత్ ఫైర్

Updated Date - Oct 21 , 2026 | 08:12 PM

ప్రభుత్వ లాంఛనాలతో.. ముగిసిన దేవా అంత్యక్రియలు

టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. ముగ్గురు నిందితుల అరెస్ట్!

‘జైలర్ 2’ సెట్‌లో మోహన్ బాబు.. ‘జైలర్ 3’లో ఏమైనా?

మనం ఎప్పుడూ భయపడకూడదు.. ఇచ్చిపడేయాలి: విశ్వక్‌సేన్

లాస్ ఏంజెల్స్‌లో ‘రామాయణ’ హిస్టారికల్ వరల్డ్ ప్రీమియర్.. ఎప్పుడంటే?