సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

నెక్ట్స్ లెవెల్ లవ్ స్టోరీగా ‘మెట్రో లవర్’

ABN, Publish Date - Oct 05 , 2026 | 05:16 PM

‘మెట్రో లవర్’ మూవీ రిలీజ్ డేట్ ఖరారు.. నవంబర్ 20న విడుదల | Metro Lover

Metro Lover Movie

సాహితీ అవంచ నాయికగా నటించిన 'కళ్యాణం కమనీయం జీవితం' సినిమా సెప్టెంబర్‌ 25న విడుదలైంది. ఇప్పుడు ఆమె నటించిన మరో సినిమా 'మైట్రో లవర్' నవంబర్‌ 20న విడుదల కాబోతోంది. అలానే నరేన్‌ వనపర్తి 'ఊరికి ఉత్తరాన' మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు. 'మెట్రో లవర్' అతనికి సెకండ్ ఫిల్మ్. ఈ సినిమాను మహేశ్‌ నాంపెల్లి డైరెక్ట్ చేయగా మాల్య కందుకూరి, శివకుమార్ రాజంపేట, గడ్డం రవి కుమార్, సంతోష్ జాదవ్ నిర్మిస్తున్నారు. స్టార్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు.

తాజాగా ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డైరెక్టర్ త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ, 'నరేన్, మాల్య నాకు ధమాకా సినిమా నుంచి పరిచయం. వారు 'మెట్రో లవర్' సినిమాతో రావడం చాలా ఆనందంగా ఉంది. నరేన్‌కి సినిమా అంటే చాలా ప్యాషన్. ఈ టీజర్‌లో ఆ ప్యాషన్ కనిపిస్తోంది. ఒక సినిమా చేసి రిలీజ్ చేయడం పెద్ద సాహసం. నేను ఈ సినిమా చూశాను. నాకు చాలా నచ్చింది. కథ, భీమ్స్ మ్యూజిక్, కెమెరా వర్క్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.


హీరో నరేన్ మాట్లాడుతూ, 'భీమ్స్‌తో ఇరవై ఏళ్ల స్నేహం. తను మా ఫ్యామిలీ మెంబర్. కిరణ్ అన్న చెప్పిన ఈ కథ నాకు చాలా నచ్చింది. మా నిర్మాతలు ఎంతగానో సహకరించారు. భీమ్స్ పెద్ద సినిమాలకు మ్యూజిక్ ఇస్తున్నారు. అలాంటి ఆయన మా సినిమాకి మ్యూజిక్ ఇవ్వడం, అలాగే కథలో కూడా కొన్ని కీలక సూచనలు ఇవ్వడం మాకు ఎంతగానో ఉపయోగపడింది. ఈ సినిమాలో పని చేసిన అందరికీ థాంక్యూ. ఇది నెక్స్ట్ లెవల్ స్టోరీ. సినిమా చూసి చాలా సర్‌ప్రైజ్ అవుతారు' అని అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ మాట్లాడుతూ, 'ఈ స్టేజ్ మీద ఉన్న మా హీరో, ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఒక కుటుంబ సభ్యుల్లాంటి వాళ్లం. ఎలాంటి లాభాపేక్ష లేకుండా అందరం ఉమ్మడిగా చేసిన సినిమా ఇది. ఇది మంచి కాన్సెప్ట్ ఉన్న మూవీ. చాలా నిజాయితీగా ఈ సినిమా చేశాం. టీం అందరూ ఎంతగానో కలిసికట్టుగా చేశాం. 'మెట్రో లవర్' ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాం' అని అన్నారు.


బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ, 'నరేన్ నాకు తెలుసు. తన తొలి సినిమాకి మంచి పేరు వచ్చింది. తనకి సినిమా అంటే చాలా ప్యాషన్. టీజర్ చాలా అద్భుతంగా ఉంది. కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది. హిట్ అవుతుందనే నమ్మకం కలిగించింది. కంటెంట్ ఉన్న సినిమాలు హిట్ అవుతున్నాయి. ఈ సినిమా కూడా ఆ కోవలోకి వస్తుందని నమ్ముతున్నాను. భీమ్స్ ఈ సినిమాకి మ్యూజిక్ ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది' అని అన్నారు. డైరెక్టర్ మహేష్ నాంపల్లి మాట్లాడుతూ, 'ఇలాంటి కథ ఇప్పటివరకు రాలేదు. భీమ్స్ అన్న సినిమాకి మ్యూజిక్ ఇవ్వడం మా అదృష్టం. సినిమా ఖచ్చితంగా చాలా బాగుంటుంది' అని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

నాపై ఐటీ దాడులా.. అసలు నిజాలు తెలుసుకోరా?: రకుల్ ప్రీత్ సింగ్

‘చుట్టమల్లే’ మార్ఫింగ్ వీడియోపై జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్

పాత్రకు జీవం పోసేందుకు.. నటీనటుల్లో తరగని నటనాభిలాష!

Updated Date - Oct 05 , 2026 | 05:23 PM