Varanasi: అప్పుడే.. వారి బుర్రలకు పని పెట్టిన జక్కన్న
ABN , Publish Date - Oct 04 , 2026 | 06:44 PM
యాంకర్: మహేశ్ బాబు, రాజమౌళి కాంబోలో వస్తోన్న 'వారణాసి' టాలీవుడ్ లో ఓ బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తుందని టాక్. ఆ ఫిగర్ వింటూంటేనే 'అమ్మో.. అంతనా' అనిపిస్తోంది. ఇంతకూ ఆ మొత్తం ఎంత?
వారణాసి' న్యూ బెంచ్ మార్క్
తెలుగు రాష్ట్రాల్లోనే.. రూ.300 కోట్లు
రాజమౌళి (ss rajamouli) సినిమాలతోనే పలువురు స్టార్ హీరోస్‌గా నిలిచారు. వారిలో ఆల్ ఇండియా సూపర్ స్టార్ అనిపించుకున్నవారూ ఉన్నారు- మరికొందరు గ్లోబల్ స్టార్స్ గానూ జేజేలు అందుకున్నారు. అయితే మొట్టమొదటిసారి తన కెరీర్ లో ఆల్రెడీ సూపర్ స్టార్ గా సాగుతోన్న మహేశ్ బాబు హీరోగా రాజమౌళి వారణాసి (varanasi) మూవీ తెరకెక్కించారు. ఈ కారణంగా మొదటి నుంచీ 'వారణాసి' సినిమాపై సినీ ఫ్యాన్స్‌లో ఓ స్పెషల్ బజ్ నెలకొంది.
'మగధీర' , 'బాహుబలి' సిరీస్, 'ట్రిపుల్ ఆర్' మూవీస్ తో టాలీవుడ్ థియేట్రికల్ బిజినెస్‌లో బెంచ్ మార్క్స్ క్రియేట్ చేశారు రాజమౌళి. 'పుష్ప- ద రూల్' వచ్చే దాకా రాజమౌళి 'ట్రిపుల్ ఆర్' మూవీ తెలుగు రాష్ట్రాల్లో బెంచ్ మార్క్ గా ఉండేది. ఇప్పుడు 'పుష్ప-2'ను దాటేసి 'వారణాసి' ఓ న్యూ బెంచ్ మార్క్‌గా నిలవనుందని తెలుస్తోంది. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే 'వారణాసి' థియేట్రికల్ బిజినెస్ 275 కోట్ల నుండి 300 కోట్లు ఉంటుందని సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం 213 కోట్ల థియేట్రికల్ బిజినెస్ తో 'పుష్ప-2' రికార్డ్ గా ఉంది. దానిని 'వారణాసి' తప్పకుండా అధిగమిస్తుందని ట్రేడ్ సర్కిల్స్ టాక్.
అదంత ఈజీ కాదు..
ఓ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ అనగానే కేవలం థియేట్రికల్ రైట్స్ గురించి ఆలోచిస్తూంటారు. కానీ, నిర్మాతకు థియేట్రికల్ రైట్స్ తో పాటు, ఓటీటీ, శాటిలైట్, మ్యూజిక్ అండ్ ఆడియో రైట్స్, ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ ద్వారా చాలా మొత్తం అందుతుంది. అందువల్ల భారీ చిత్రాలు నిర్మించేవారికి నష్టం అంటూ ఉండదు. కానీ, థియేట్రికల్ రైట్స్ లో డిస్ట్రిబ్యూటర్స్ , బయ్యర్స్, ఎగ్జిబిటర్స్ కు భారీ నష్టం వాటిల్లితే దాంతో వచ్చిన ఆదాయంలో కొంతయినా చెల్లించుకోక తప్పదు.
అలా భారీ చిత్రాలకు కాస్త నష్టం వాటిల్లే పరిస్థితులూ లేకపోలేదు. అయితే ఇప్పటి దాకా రాజమౌళి సినిమాల విషయంలో నిర్మాతలకు, కొనుగోలు దారులకు, ప్రదర్శన శాలల వారికి లాభాలే వచ్చాయి. దాంతో రాబోయే 'వారణాసి'పై మరింత క్రేజ్ చోటుచేసుకుంది. అందువల్ల నిర్మాతలు చెప్పిన రేటుకు కొనుగోలుదారులు సైతం సై అంటున్నారు. ఒకవేళ 'వారణాసి' కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో 300 కోట్ల దాకా బిజినెస్ చేస్తే దానిని టచ్ చేయడం ఇతరులకు అంత సులువు కాదని చెప్పొచ్చు.
ఇప్పటి నుంచే లెక్కలు..
ఓ సినిమా వంద కోట్ల గ్రాస్ సాధిస్తే, అందులో అన్ని ఖర్చులూ పోతే డిస్ట్రిబ్యూషన్ లేదా ప్రొడ్యూసర్ షేర్ 40 కోట్ల దాకా ఉంటుంది. అంటే వంద కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమా 105 కోట్లు పోగేసినంత మాత్రాన ఆ చిత్రాన్ని హిట్ గా పరిగణించలేం. ఎందుకంటే థియేటర్స్ రెంటల్స్ తీసేయాలి - తరువాత జీఎస్టీ మినహాయించాలి - ఇక మిగిలిందే షేర్. దానిని అగ్రిమెంట్ ప్రకారం నిర్మాతలు, పంపిణీదారులు పంచుకోవలసి ఉంటుంది.
ఈ కోణంలో చూస్తే 300 కోట్ల బెంచ్ మార్క్ టచ్ చేయనున్న 'వారణాసి' రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బ్రేక్ ఈవెన్ చూడాలంటే 480 కోట్ల గ్రాస్ వసూలు చేయాలని ట్రేడ్ సర్కిల్స్ లెక్కలు కడుతున్నాయి. దాంతో 'వారణాసి' టిక్కెట్ రేట్స్ హైక్ కూడా రికార్డ్ స్థాయిలో ఉంటుందని ట్రేడ్ టాక్. రిలీజ్‌కు ముందుగానే ట్రేడ్ పండిట్స్ బుర్రలకు పని పెట్టిన 'వారణాసి' వచ్చే యేడాది ఏప్రిల్ 7వ తేదీన రిలీజై ఎంత పోగేస్తుందో చూద్దాం.