నాపై ఐటీ దాడులా.. అసలు నిజాలు తెలుసుకోరా?: రకుల్ ప్రీత్ సింగ్
ABN , Publish Date - Oct 05 , 2026 | 12:53 PM
వార్త ఏదైనా సరే.. నిజానిజాలు నిర్ధారించుకోకుండా కేవలం వ్యూస్, రేటింగ్స్, సంచలనాల కోసమే కథనాలు అల్లేసే ధోరణి మీడియా తయారైంది అంటూ రకుల్ ప్రీత్ సింగ్ ఫైర్ అయ్యారు.
వార్త ఏదైనా సరే.. నిజానిజాలు నిర్ధారించుకోకుండా కేవలం వ్యూస్, రేటింగ్స్, సంచలనాల కోసమే కథనాలు అల్లేసే ధోరణి మీడియా తయారైంది అంటూ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ఫైర్ అయ్యారు. ముంబైలోని సుమారు 12 చోట్ల రకుల్ ప్రీత్ సింగ్‌కు చెందిన నివాసాలు, ఆఫీసులపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారంటూ గత రెండు రోజులుగా మెయిన్‌స్ట్రీమ్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో కథనాలు తెగ చక్కర్లు కొట్టాయి. ఈ ప్రచారంపై తీవ్ర మనస్తాపానికి గురైన రకుల్.. తాజాగా ‘ఎక్స్’ వేదికగా నేరుగా రంగంలోకి దిగి ఆ వార్తలన్నింటినీ ఖండిస్తూ గట్టి కౌంటర్ ఇచ్చారు.
సోషల్ మీడియా వేదికగా రకుల్ స్పందిస్తూ మీడియా తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘వాస్తవాలు కనీసం చెక్ చేసుకోకుండా సంచలనం కోసం తాపత్రయపడే కొందరు ఆన్‌లైన్ రిపోర్టర్లు, మెయిన్ స్ట్రీమ్ మీడియా జర్నలిస్టుల తీరు చూస్తుంటే నిజంగా బాధేస్తోంది. అందుకే అసలు వాస్తవాలను అందరికీ ఒకేసారి తేల్చి చెప్పాలనుకుంటున్నా. తాజాగా జరిగిన ఆ ఐటీ సోదాలకు, నాకు ఎలాంటి సంబంధం లేదు. అది నాపై జరిగిన దాడి కానే కాదు. నేను ఒక ఆర్మీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చాను. సినీ పరిశ్రమలో నాకు ఎలాంటి గాడ్‌ఫాదర్స్ లేరు. నా స్వయంకృషితో, కష్టపడి పైకొచ్చాను. చట్టాన్ని గౌరవించే బాధ్యతాయుతమైన భారత పౌరురాలిగా 20 ఏళ్ల వయసు నుంచే నా ప్రతి పైసాకు సక్రమంగా పన్నులు చెల్లిస్తున్నాను. వ్యక్తిగతంగా గానీ, ఏ ప్రొడక్షన్ హౌస్ తరపున గానీ ఎలాంటి అక్రమ విదేశీ లావాదేవీల్లోనూ నేను భాగస్వామిని కాను.
బినామీ ఆస్తులు లేవు.. ఎవరి గిఫ్టులూ తీసుకోను!
దేశంలో కానీ, విదేశాల్లో కానీ ఎవరి తరపునా నాకు ఒక్క బినామీ ఆస్తి కూడా లేదు. నా కెరీర్‌లో ఇప్పటివరకు ఎవరూ నాకు ఆస్తులను గిఫ్ట్‌గా ఇవ్వలేదు.. నాకంటూ ఒక సూత్రం ఉంది, జీవితంలో ఎవరి నుంచీ అలాంటి ఖరీదైన బహుమతులను నేను తీసుకోను. మీడియా బిజినెస్ నడపడంలో ఎవరికి ఉండే వ్యాపార ఒత్తిళ్లు వారికి ఉంటాయని నాకు తెలుసు. అంతమాత్రాన ఆ ఒత్తిళ్లు నిజాలను తొక్కిపెట్టేలా ఉండకూడదు. ఇంకొకరి పరువు, గౌరవ మర్యాదలు, జీవితాలను బలిపీఠం ఎక్కించి వ్యాపారం చేసుకోకూడదు. నాపై ఇలాంటి నిరాధారమైన, ద్వేషపూరితమైన వార్తలు రాసిన ప్రతి ఒక్కరూ తక్షణమే ఆ తప్పుడు కథనాలను వెనక్కి తీసుకుని, వాస్తవాలను ప్రజలకు స్పష్టం చేయాలని కోరుతున్నాను’’ అంటూ రకుల్ విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి:
‘చుట్టమల్లే’ మార్ఫింగ్ వీడియోపై జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
పాత్రకు జీవం పోసేందుకు.. నటీనటుల్లో తరగని నటనాభిలాష!
బాలయ్య వర్సెస్ చిరంజీవి.. మరో ఆసక్తికర ఫైట్‌కు అంతా సిద్ధం