అనుకున్నట్లే జరిగితే.. ఇక సీట్లలో కూర్చోవడం కష్టమే
ABN , Publish Date - Oct 04 , 2026 | 04:11 PM
భారతీయ సినీ పరిశ్రమలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అత్యంత క్రేజీ, పవర్-ప్యాక్డ్ కాంబినేషన్లలో 'మ్యాన్ ఆఫ్ మాసెస్' ఎన్టీఆర్, 'సంచలన దర్శకుడు' ప్రశాంత్ నీల్ కలయిక ఒకటి.
భారతీయ సినీ పరిశ్రమలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అత్యంత క్రేజీ, పవర్-ప్యాక్డ్ కాంబినేషన్లలో 'మ్యాన్ ఆఫ్ మాసెస్' ఎన్టీఆర్ (NTR), 'సంచలన దర్శకుడు' ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కలయిక ఒకటి. వీరిద్దరి కాంబోలో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘డ్రాగన్’ (Dragon). ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సోషల్ మీడియాలో ఎలాంటి విధ్వంసం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
దీనికి తోడు కేజీఎఫ్, సలార్ చిత్రాలకు ఊపిరిపోసిన నీల్ ఆస్థాన సంగీత దర్శకుడు రవి బస్రూర్ అందించబోయే మ్యూజిక్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. అనిల్ కపూర్, బిజు మీనన్, ఖుష్బు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అంతే కాదు.. బాలీవుడ్ స్టార్స్ షాహిద్ కపూర్, ఆలియా భట్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కానున్నారని ఫిలింనగర్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
అయితే, ఇటీవల ఈ సినిమా షూటింగ్‌లో ఎన్టీఆర్ గాయపడటం, ఆయనకు చిన్న సర్జరీ జరగడం తెలిసిందే. ప్రస్తుతం తారక్ పూర్తిగా కోలుకున్నారు. త్వరలోనే ఆయన 'డ్రాగన్' కొత్త షెడ్యూల్ షూటింగ్‌లో పాల్గొననున్నారు. అయితే, తారక్ రెస్ట్ తీసుకుంటున్న సమయంలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఏమాత్రం సమయం వృధా చేయలేదు. ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలను చిత్రీకరించి ప్రొడక్షన్‌ను ముందుకు నడిపించారు. ముందుగా చెప్పినట్లే.. వచ్చే ఏడాది జూన్ నాటికి ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురానున్నట్లు ఇటీవల ఎన్టీఆర్ స్వయంగా స్పష్టం చేశారు. దీంతో ప్రశాంత్ నీల్ కూడా పక్కా షెడ్యూళ్లతో షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను స్పీడప్ చేస్తున్నారు.
ఇక ఇప్పుడు అసలు విషయానికి వస్తే.. తాజాగా ఫిలిం సర్కిల్స్‌లో ఒక వార్త సంచలనంగా మారింది. ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని ఏకంగా హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారట. ముఖ్యంగా మూవీలో వచ్చే 'జైల్ ఫైట్', 'కాళీమాత టెంపుల్ ఫైట్' సీన్స్ సినిమాకే ప్రధాన హైలైట్‌గా నిలవబోతున్నాయని సమాచారం. ఈ యాక్షన్ సీన్స్ కోసం హాలీవుడ్ లెవెల్ లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారట. థియేటర్లలో ఈ సీన్స్ చూస్తున్నప్పుడు అభిమానులు సీట్లలో కూర్చోవడం కష్టమేనని, పూనకాలు రావడం ఖాయమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ప్రశాంత్ నీల్ తన మార్క్ డార్క్ షేడ్స్‌కు భిన్నంగా, ఈ సినిమాలో ప్రకాశవంతమైన రంగులు, విభిన్నమైన లైటింగ్, సరికొత్త ఫ్రేమింగ్‌ను ఉపయోగించబోతున్నారట. ఇది కేవలం విజువల్ బ్యూటీ కోసం మాత్రమే కాదు.. కథలో ఎన్టీఆర్ పాత్రకు ఉండే ఎమోషనల్ వేరియేషన్స్ ప్రేక్షకులకు బలంగా కనెక్ట్ చేయడం కోసమేనట. మరి హాలీవుడ్ రేంజ్ ఫైట్స్, కొత్త తరహా విజువల్స్ తో వస్తున్న 'డ్రాగన్' బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.