సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Chiranjeevi: 12 గంటలపాటు ఏకధాటిగా వర్షంలో..

ABN, Publish Date - Jul 09 , 2026 | 06:47 PM

తమని అభిమానించే అభిమానులు కోసం సినిమాల్లో ఎన్నో ఫీట్లు చేస్తుంటారు హీరోలు. ప్రేక్షకుల్ని అలరించడానికి ఎంత కష్టపడటానికైనా వెనకాడరు.

తమని అభిమానించే అభిమానులు కోసం సినిమాల్లో ఎన్నో ఫీట్లు చేస్తుంటారు హీరోలు. ప్రేక్షకుల్ని అలరించడానికి ఎంత కష్టపడటానికైనా వెనకాడరు. ఫైట్స్‌ కోసం ఒళ్లు హూనం చేసుకుంటారు. మెగాస్టార్‌ (chiranjeevi) ఇప్పుడు తాజా చిత్రం కోసం అలాగే కష్టపడుతున్నారు. ప్రస్తుతం ఆయన చిరంజీవి ప్రస్తుతం సినీ ప్రియు?ని ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో చిరంజీవి హీరోగా కె.ఎస్‌ రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో మెగా 158 (mega 158) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కెవిఎన్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన బారీ సెట్‌లో యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్‌. చిరంజీవి ఓ వర్షం సీక్వెన్స్‌ కోసం 12 గంటలపాటు ఏకధాటిగా షూటింగ్‌ చేశారు. ‘ఉదయం 4 గంటలకు వర్కవుట్స్‌తో డేసు మొదలుపెట్టే చిరంజీవి నిబద్థత చూసి మా చిత్రబృందం సర్‌ప్రైజ్‌ అయింది. అత్యంత కఠినమైన యాక్షన్‌ సన్నివేశాలను షూట్‌ చేయడం కోసం 12 గంటలు పట్టింది. వర్షంలో ఉండే ఈ సన్నివేశాన్ని చిరంజీవి ఎంతో కష్టపడి పూర్తి చేశారు. అందుకే ఆయన మెగాస్టార్‌ అయ్యారు’ అని చిత్ర బృందం తెలిపింది. నివేద పేతురాజు, అనశ్వర రాజన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

బాలయ్య సినిమాలో రోల్‌పై కాజల్ షాకింగ్ కామెంట్స్!

అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు ఒక గుడ్ న్యూస్ - ఒక బ్యాడ్ న్యూస్

బాలీవుడ్ కంటే టాలీవుడ్ చాలా బెటర్: సోనాలి బింద్రే

Updated Date - Jul 09 , 2026 | 06:58 PM