బాలీవుడ్ కంటే టాలీవుడ్ చాలా బెటర్: సోనాలి బింద్రే
ABN , Publish Date - Jul 09 , 2026 | 12:12 AM
టాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ స్టార్ హీరోలందరి సరసన నటించి టాప్ హీరోయిన్‌గా పేరొందిన హీరోయిన్ సోనాలి బింద్రే. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఆ రోజుల్లో బాలీవుడ్‌తో పోలిస్తే టాలీవుడ్ ఎంత పక్కాగా ఉండేదో గుర్తుచేసుకున్నారు.
టాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ స్టార్ హీరోలందరి సరసన నటించి టాప్ హీరోయిన్‌గా పేరొందిన హీరోయిన్ సోనాలి బింద్రే (Sonali Bendre). తెలుగులో ఆమె నటించిన ‘మురారి, ఇంద్ర, మన్మథుడు’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో ఇక్కడి ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఆ రోజుల్లో బాలీవుడ్‌తో పోలిస్తే టాలీవుడ్ ఎంత పక్కాగా ఉండేదో గుర్తుచేసుకున్నారు.
ఆమె మాట్లాడుతూ.. ‘‘నేను తెలుగు సినిమాల్లో నటించే రోజుల్లో, టాలీవుడ్ (Tollywood) సెట్స్ చాలా పద్ధతిగా, ఆర్టిస్ట్‌లకు అనుకూలంగా ఉండేవి. హిందీ ఇండస్ట్రీ (Bollywood) కంటే తెలుగు ఇండస్ట్రీ ఎంతో ఆర్గనైజ్డ్‌గా పనిచేసేది. అప్పట్లో టాలీవుడ్‌లో స్క్రిప్ట్, సీన్లు అన్నీ ముందుగానే పక్కాగా రెడీ చేసి పెట్టుకునేవారు. కానీ బాలీవుడ్‌లో కొన్ని సినిమాలకైతే షూటింగ్ స్పాట్‌లోనే సీన్లు రాస్తూ ఉండేవారు. అది నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించేది’’ అని సోనాలి చెప్పుకొచ్చారు.
దీంతో పాటు తెలుగు సినిమాల బడ్జెట్, మేకింగ్ స్టైల్ గురించి కూడా ఆమె ప్రశంసలు కురిపించారు. ‘‘తెలుగు సినిమాలు చాలా పెద్దవి. వాటి బడ్జెట్, షూటింగ్ ప్లానింగ్ చూస్తే హిందీ సినిమాలు కూడా సరితూగవు. షూటింగ్స్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీ, అన్నపూర్ణ స్టూడియోలతో పాటు విదేశాల్లోనూ భారీగా ప్లాన్ చేసేవారు. అలాగే తెలుగు సెట్స్‌లో పెట్టే టిఫిన్, భోజనం నాకు ఎంతో ఇష్టం’’ అంటూ ఆనాటి జ్ఞాపకాలను సోనాలి బింద్రే పంచుకున్నారు. ప్రస్తుతం ఈమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
Rajesh Sharma: ప్రభాస్ ‘ఫౌజీ’ సినిమా షూటింగ్‌లో తీవ్ర విషాదం.. విష పురుగు కాటుతో ఐసీయూలో నటుడు
ఆ దర్శకుడితో రెండో పెళ్లి.. షాకిచ్చిన కలర్స్ స్వాతి
భాగ్యరాజ్‌ను ఐస్ బాక్సులో చూడలేకే.. ఊర్వశి షాకింగ్ కామెంట్స్
VK Naresh: ఏపీలోనూ తమిళనాడు తరహాలో...