బాలయ్య సినిమాలో రోల్‌పై కాజల్ షాకింగ్ కామెంట్స్!
ABN , Publish Date - Jul 09 , 2026 | 05:42 PM
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఒకవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూనే, మరోవైపు అగ్ర హీరోల సినిమాల్లో విభిన్న పాత్రలు పోషిస్తూ బిజీగా గడుపుతోంది.
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఒకవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూనే, మరోవైపు అగ్ర హీరోల సినిమాల్లో విభిన్న పాత్రలు పోషిస్తూ బిజీగా గడుపుతోంది. గతంలో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) సరసన ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) చిత్రంలో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడు మరోసారి ఆయనతో జతకడుతోంది. వీరిద్దరి కలయికలో రాబోతోన్న ‘NBK111’ సినిమాలో కాజల్ ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తోంది. ఇటీవల విడుదలైన ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో మంచి ఆదరణ దక్కించుకుంది.
గత కొన్ని రోజులుగా ఈ సినిమాలో కాజల్ పాత్రపై సినీ వర్గాల్లో ఆసక్తికరమైన వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇందులో ఆమె ముంబై క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్‌గా కనిపిస్తుందని, కథ మొత్తాన్ని మలుపు తిప్పే అత్యంత ప్రాధాన్యత కలిగిన పాత్ర ఇదేనని జోరుగా చర్చ సాగుతోంది. యాక్షన్, ఇన్వెస్టిగేషన్ అంశాలతో ముడిపడి ఉన్న ఈ క్యారెక్టర్ గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కాజల్ స్వయంగా స్పందించింది. తన పాత్ర ఎక్కడా ఫన్నీగా ఉండదని, చాలా సీరియస్‌గా సాగుతుందని ఆమె స్పష్టం చేసింది. ఈ వ్యాఖ్యలతో ప్రచారంలో ఉన్న వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది. గ్లామర్, రొమాంటిక్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన కాజల్, ఈసారి ఒక పవర్‌ఫుల్, ఇంటెన్స్ లుక్‌లో సరికొత్తగా కనిపించబోతోందని స్పష్టమవుతోంది. కాజల్ వెల్లడించిన విషయాల తర్వాత నెట్టింట సరికొత్త అంచనాలు మొదలయ్యాయి. ముఖ్యంగా సినిమాలో బాలకృష్ణ, కాజల్ పాత్రల మధ్య నడిచే ఘర్షణ, పోటాపోటీ సన్నివేశాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని అభిమానులు భావిస్తున్నారు. ఆమె నిజంగానే పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తే, బాలయ్యతో వచ్చే సీన్స్ థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయనడంలో సందేహం లేదు. అయినప్పటికీ, చిత్ర బృందం నుంచి ఆమె పాత్రపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడంతో, పూర్తి వివరాల కోసం సినీ ప్రియులు ఎంతగానో నిరీక్షిస్తున్నారు.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘NBK111’ పై టాలీవుడ్‌లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే వీరి కాంబినేషన్‌లో ‘వీరసింహా రెడ్డి’ మంచి విజయం సాధించింది. దీంతో ఈ సారి పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో బాలకృష్ణను మునుపెన్నడూ చూడని రీతిలో చూపించేందుకు దర్శకుడు సన్నాహాలు చేస్తున్నారు. కాజల్ కొత్త లుక్, బాలయ్య మార్క్ యాక్షన్ కలయిక ఈ సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్ చేస్తోంది. మరి ఈ సినిమాతో బాలయ్య, గోపీచంద్ మలినేని, కాజల్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి.
ఇవి కూడా చదవండి:
అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు ఒక గుడ్ న్యూస్ - ఒక బ్యాడ్ న్యూస్
బాలీవుడ్ కంటే టాలీవుడ్ చాలా బెటర్: సోనాలి బింద్రే
Rajesh Sharma: ప్రభాస్ ‘ఫౌజీ’ సినిమా షూటింగ్‌లో తీవ్ర విషాదం.. విష పురుగు కాటుతో ఐసీయూలో నటుడు