Madhav: గట్టి పోటీ నడుమ 'మారెమ్మ'
ABN, Publish Date - Jul 22 , 2026 | 01:01 PM
రవితేజ సోదరుడు రఘు తనయుడు మాధవ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'మారెమ్మ'. ఈ సినిమాను వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న రిలీజ్ చేయబోతున్నారు.
ఈసారి వినాయక చవితికి బాక్సాఫీస్ బరిలో ఆసక్తికరమైన పోటీ నెలకొంది. ఇప్పటికే సెప్టెంబర్ 10న విజయ్ దేవరకొండ 'రణబాలి' విడుదల కాబోతోంది. ఇది పాన్ ఇండియా మూవీ. విజయ్ దేవరకొండ, రశ్మిక మందణ్ణ వివాహానంతరం వీరు కలిసిన నటించిన సినిమా కావడంతో 'రణబాలి'పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అయితే ఇదే రోజున కార్తి తమిళ అనువాద చిత్రం 'సర్దార్ -2', సూరి, సుహాస్ ప్రధాన పాత్రలు పోషించిన తమిళ చిత్రం 'మందాడి' కూడా రాబోతున్నాయి. అలానే ఫహద్ ఫాజిల్ హీరోగా నటిస్తున్న తెలుగు సినిమా 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' మూవీ కూడా సెప్టెంబర్ 10న రాబోతోంది. ఇన్ని సినిమాలతో ఇప్పుడు రవితేజ తమ్ముడి రఘు కొడుకు మాధవ్ సినిమా పోటీ పడబోతోంది.
మాస్ మహరాజా రవితేజ సోదరుడి కొడుకైన మాధవ్ విలేజ్ యాక్షన్ డ్రామా 'మారెమ్మ'తో హీరోగా బిగ్ స్క్రీన్ పై అడుగు పెడుతున్నాడు. ఈ మూవీతో మంచాల నాగరాజు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మయూర్ రెడ్డి బండారు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. దీపా బాలు హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు. వినోద్ కుమార్, వికాస్ వశిష్ట, దయానంద్ రెడ్డి, వి.ఎస్. రూపాలక్ష్మి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 10న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ తెలిపారు. మరి మాధవ్ తన డెబ్యూ మూవీతో ఇదే రోజు వస్తున్న ఇతర స్టార్స్ చిత్రాలతో ఎలా తట్టుకుంటాడో చూడాలి.
ALSO READ:
స్పిరిట్ లో కత్రీనా కైఫ్.. ఏం ప్లాన్ చేశావయ్యా సందీపూ!
బాలయ్యకు ప్రమాదం.. పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే...
పెళ్లి తరువాత అక్కినేని కోడలు రీఎంట్రీ.. ఆ హీరోతో రొమాన్స్