బాలయ్యకు ప్రమాదం.. పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే

ABN , Publish Date - Jul 21 , 2026 | 09:26 PM

గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తోన్న సినిమా షూటింగ్ లో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)కి ప్రమాదం జరిగిన విషయం తెల్సిందే. NBK111 షూటింగ్ కాకినాడలో జరుగుతున్న సమయంలో ఓ యాక్షన్ సీక్వెన్స్ లో బాలయ్యకు చిన్న మజిల్ టియర్ అయ్యింది.

Pawan Kalyan

గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తోన్న సినిమా షూటింగ్ లో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)కి ప్రమాదం జరిగిన విషయం తెల్సిందే. NBK111 షూటింగ్ కాకినాడలో జరుగుతున్న సమయంలో ఓ యాక్షన్ సీక్వెన్స్ లో బాలయ్యకు చిన్న మజిల్ టియర్ అయ్యింది. దీంతో వెంటనే బాలయ్యను హాస్పిటల్ కి తీసుకెళ్లారు. వైద్యుల సూచన మేరకు, ఆయన పూర్తిగా కోలుకోవడానికి ఒక చిన్న మైనర్ సర్జరీ చేయాల్సి ఉందని చిత్రబృందం అధికారికంగా తెలిపింది. అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆయన త్వరగా కోలుకుని మళ్లీ షూటింగ్‌లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.


ఇక బాలయ్య ప్రమాదంపై ఎన్టీఆర్, నందమూరి కళ్యాణ్ రామ్ స్పందించారు. బాల బాబాయ్ త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం.. బాలయ్య ప్రమాదంపై స్పందించారు. బాలయ్య త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. 'హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ సినిమా చిత్రీకరణలో గాయపడ్డారని తెలిసింది. ఆయన ఆరోగ్య పరిస్థితిని అధికారుల ద్వారా తెలుసుకున్నాను. మజిల్ టేయర్ ఉందని చెప్పారు. బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను' అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు.


బాలకృష్ణకు గాయమైందన్న వార్తతో ఆందోళనలో ఉన్న నందమూరి అభిమానులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ కొంత ఉపశమనాన్ని ఇచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. జనసేన, టీడీపీ, నందమూరి అభిమానులు బాలయ్య త్వరగా కోలుకోవాలంటూ కామెంట్ల రూపంలో తమ పవర్‌ఫుల్ మెసేజ్‌లను పంచుకుంటున్నారు.

Updated Date - Jul 21 , 2026 | 09:29 PM