పెళ్లి తరువాత అక్కినేని కోడలు రీఎంట్రీ.. ఆ హీరోతో రొమాన్స్
ABN , Publish Date - Jul 21 , 2026 | 08:31 PM
అక్కినేని పెద్ద కోడలు శోభిత ధూళిపాళ (Sobhita) ప్రస్తుతం ఇంటి బాధ్యతలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. పెళ్లి తరువాత కూడా సినిమాలు ఆపనని చెప్పిన ఆమె చీకటిలో అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అక్కినేని పెద్ద కోడలు శోభిత ధూళిపాళ (Sobhita) ప్రస్తుతం ఇంటి బాధ్యతలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. పెళ్లి తరువాత కూడా సినిమాలు ఆపనని చెప్పిన ఆమె చీకటిలో అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సిరీస్ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇక ఇప్పుడు శోభిత రీఎంట్రీకి పక్కా ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. టాలీవుడ్ లో కాకుండా కోలీవుడ్ లో అమ్మడు ఒక లక్కీ ఛాన్స్ పట్టేసిందని టాక్. వర్సటైల్ యాక్టర్ రవి మోహన్ గత కొన్ని నెలలుగా వ్యక్తిగత సమస్యలతో బాధపడుతున్న విషయం తెల్సిందే. ఆ సమస్యలను దాటుకొని ఆయన అభిమానులను అలరించడానికి సిద్ధమయ్యాడు.
రవి మోహన్ హీరోగా ఆయన బ్యానర్ లోనే తెరకెక్కుతోన్న చిత్రం వైట్. అగ్ర సంగీత దర్శకుడు అనిరుధ్ వద్ద అసోసియేట్‌గా పనిచేసిన జి.ఎన్.డి. శ్యామ్‌కుమార్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. అంతేకాకుండా ఈ సినిమాకి అనిరుధ్ రవిచందర్ స్వయంగా సంగీతం అందిస్తుండటం గమనార్హం. ఇక ఈ సినిమాలో రవి మోహన్ సరసన హీరోయిన్ గా అక్కినేని కోడలు శోభిత నటించనుందని సమాచారం. ఇప్పటికే రవి మోహన్ - శోభిత పొన్నియన్ సెల్వన్ సినిమాలో జంటగా కనిపించారు. హీరోయిన్ కి ప్రాధాన్యత ఉన్న పాత్ర కావడంతో శోభిత కూడా ఓకే చెప్పిందని టాక్.
అక్కినేని నాగ చైతన్యతో పెళ్లి తరువాత శోభిత వెండితెరపై కనిపించింది లేదు. ఒకప్పుడు బాలీవుడ్ లో బోల్డ్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన శోభిత పెళ్లి తరువాత సినిమాలే తగ్గించింది. ఇక ఇప్పుడు ఈ సినిమాతో రీఎంట్రీ ఇవ్వనుండడంతో ఈ థ్రిల్లర్ మూవీపై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో రవి మోహన్ ఒక అకౌంటెంట్ కనిపించనున్నాడట. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ వైట్ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. మరి ఈ సినిమాతో శోభిత ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.