స్పిరిట్ లో కత్రీనా కైఫ్.. ఏం ప్లాన్ చేశావయ్యా సందీపూ
ABN , Publish Date - Jul 21 , 2026 | 10:00 PM
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) ఏం చేసినా అందులో ఒక వైల్డ్ వైబ్ ఉంటుంది. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం స్పిరిట్(Spirit).
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) ఏం చేసినా అందులో ఒక వైల్డ్ వైబ్ ఉంటుంది. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం స్పిరిట్(Spirit). పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో త్రిప్తి దిమ్రి(Tripti Dimri) హీరోయిన్ గా నటిస్తుండగా.. ఐశ్వర్య దేశాయ్ కీలక పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఆడియో గ్లిమ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు అంచనాలను సైతం పెంచేసింది. ఇప్పటికే 40 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ డార్క్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో మరో బాలీవుడ్ భామను దిమ్పుతున్నాడట వంగా.
సినిమా కథలో వచ్చే ఒక పవర్‌ఫుల్ అండ్ సర్‌ప్రైజింగ్ ట్విస్ట్ కోసం మరో బాలీవుడ్ టాప్ హీరోయిన్‌ను రంగంలోకి దించేందుకు వంగా గ్రౌండ్ వర్క్ సిద్దం చేశాడు. ఈ స్పెషల్ రోల్ కోసం బాలీవుడ్ క్వీన్ కత్రినా కైఫ్‌ను ఎంచుకోవాలని సందీప్ యోచిస్తున్నట్లు సమాచారం. చాలా రోజులుగా వెండితెరకు దూరంగా ఉంటున్న కత్రినాను కేవలం 2 రోజుల్లో పూర్తయ్యే పాత్రకు అనుకున్నాడట. ఇది కీలక పాత్ర కాదు.. క్యామియో కాదు.. సినిమాను మొత్తం పూర్తిగా మార్చేసే పాత్ర అన్నమాట. ఖుషి సినిమాలో ఎస్ జె సూర్య కనిపించేది ఒక్క నిమిషం. కానీ, ఆ పాత్ర వలన కథే మారిపోతుంది. ఇక ఇప్పుడు ఈ హీరోయిన్ పాత్ర కూడా అలానే ఉండబోతుందని టాక్.
ఇక ఈ గేమ్ ఛేంజింగ్ క్యారెక్టర్ లో కత్రీనా అయితే బావుంటుందని వంగా అనుకున్నాడట. ఒకవేళ ఆమె కుదరకపోతే ప్లాన్-బిగా మరో పాపులర్ ఫేస్‌ను కూడా లైన్‌లో పెట్టారట. ఆమె ఎవరు అనేది ఇంకా మిస్టరీగా మారింది. సందీప్ వంగ మార్క్ టేకింగ్, ప్రభాస్ మాస్ ఇమేజ్, దానికి తోడు ఈ స్టార్ హీరోయిన్ సర్‌ప్రైజ్ ప్యాకేజ్ చూస్తుంటే బాక్సాఫీస్ దగ్గర దెబ్బకి రికార్డులు బద్దలవడం ఖాయంగా కనిపిస్తోందని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. మరి స్పిరిట్ లో ఆ మెరుపు పాత్రలో మెరిసే మెరుపు తీగ ఎవరు అనేది తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.