Mandaadi: సుహాస్, సూరిల ‘మండాడి’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే
ABN, Publish Date - Jun 11 , 2026 | 09:00 PM
టాలీవుడ్ హీరో సుహాస్, కోలీవుడ్ హీరో సూరి ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం ‘మండాడి’. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.
టాలీవుడ్ హీరో సుహాస్ (Suhas), కోలీవుడ్ హీరో సూరి (Soori) ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం ‘మండాడి’ (Mandaadi). ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాపై అటు కోలీవుడ్‌లోనూ, ఇటు టాలీవుడ్‌లోనూ అంచనాలు ఏర్పరచుకున్న ఈ చిత్రం.. తీరప్రాంతం, మత్స్యకారుల నేపథ్యంలో ఉండబోతోంది. ఈ మూవీలో సూరి, సుహాస్ ఇద్దరూ.. రా అండ్ రస్టిక్ లుక్‌లో కనిపించనున్నారనే విషయం ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ తెలియజేశాయి. ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాని ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ నిర్మిస్తుండగా.. మదిమారన్ పుగళేంది తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీ విడుదలకు సంబంధించి మేకర్స్ కీలక అప్డేట్ ఇచ్చారు.
ప్రస్తుతం షూటింగ్ ముగించుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 4న విడుదల (Mandaadi Release Date) చేయబోతోన్నట్లుగా తెలుపుతూ మేకర్స్ అధికారికంగా ఓ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ రిలీజ్ డేట్ పోస్టర్‌లో సుహాస్, సూరి ఎదురెదురుగా నిలబడి.. నువ్వా? నేనా? అనేలా కనిపిస్తున్నారు. ఈ మూవీలో ఈ ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలను ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. రియల్ లొకేషన్స్‌లో ఎంతో శ్రమించి ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ సీన్స్, ఒళ్లుగగుర్పొడిచే సెయిల్‌బోట్ రేస్ సీక్వెన్స్‌ను షూట్ చేసినట్లుగా ఇప్పటికే మేకర్స్ తెలిపారు. దాదాపు రూ. 80 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోంది.
మహిమా నంబియార్ (Mahima Nambiar) హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ వంటి వారు ఇతర కీలక పాత్రలను పోషిస్తున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మాత ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లుగా తెలుస్తోంది. సూరి, సుహాస్ మార్కెట్‌ను, వారి స్థాయిని పెంచేలా ఈ సినిమా ఉంటుందని, ఇకపై రాబోయే ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు పెంచనుందని ఈ అప్డేట్‌లో మేకర్స్ తెలిపారు. ఈ సినిమాకు వెట్రిమారన్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
నేనేం తప్పు చేశానని నాకు ఈ శిక్ష: చిరంజీవి కుమార్తె శ్రీజ
బాక్సాఫీస్‌పై ‘పెద్ది’ వేట.. ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతంటే?
నిన్న అల్లు అర్జున్.. నేడు అఖిల్.. చరణ్ యాక్టింగ్‌కు ఫిదా!