Suhas: నా కెరీర్‌లో గొప్ప సినిమా
ABN , Publish Date - Aug 19 , 2025 | 05:18 AM
సుహాస్, శివానీ నగరం హీరో హీరోయిన్లుగా నూతన దర్శకుడు గోపీ అచ్చర దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రానికి ‘హే భగవాన్’ అనే టైటిల్‌ను మేకర్స్ ఖరారు చేశారు.
సుహాస్, శివానీ నగరం హీరో హీరోయిన్లుగా నూతన దర్శకుడు గోపీ అచ్చర దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రానికి ‘హే భగవాన్’ అనే టైటిల్‌ను మేకర్స్ ఖరారు చేశారు. త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బేనర్‌పై బి.నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్నారు. సుహాస్ పుట్టిన రోజు సందర్భంగా సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఈ చిత్రం టైటిల్ టీజర్‌ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా నరేశ్ వీకే మాట్లాడుతూ ‘ఈ సినిమా నా కెరీర్‌లో మరచిపోలేని గొప్ప సినిమా అవుతుంది. కథ విన్నప్పుడు పగలబడి నవ్వాను. చాలా కొత్త బ్యాక్‌డ్రాప్ తీసుకున్నారు’ అని అన్నారు. సుహాస్ మాట్లాడుతూ ‘ప్రశాంత్ ఈ సినిమాకి అద్భుతమైన కథ ఇచ్చాడు. కచ్చితంగా మంచి హిట్ కొడతాం.
నరేశ్ గారితో పనిచేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది’ అని అన్నారు. హీరోయిన్ శివాని మాట్లాడుతూ ‘ఈ సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది’ అని అన్నారు. చిత్ర దర్శకుడు గోపీ అచ్చర్ల మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో తండ్రి కొడుకుల ఎమోషన్ హృదయాలకు హత్తుకుంటుంది’ అని అన్నారు. నిర్మాత వంశీ నందిపాటి మాట్లాడుతూ ‘సుహాస్ సినీ ప్రయాణం చాలా స్ఫూర్తివంతంగా ఉంటుంది’ అని అన్నారు.