Suhas: గృహప్రవేశం టైమ్‌లో కొత్త ఇంటి గోడకు వేసే అచ్చులాంటి సినిమా ఇది నాకు..

ABN , First Publish Date - 2023-10-10T14:37:39+05:30 IST

సుహాస్ హీరోగా నటిస్తున్న నూతన చిత్రం ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దుశ్యంత్ కటికినేని దర్శకత్వంలో.. కామెడీ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్ర టీజర్‌ను సోమవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు.

Suhas: గృహప్రవేశం టైమ్‌లో కొత్త ఇంటి గోడకు వేసే అచ్చులాంటి సినిమా ఇది నాకు..
Ambajipeta Marriage Band Still

సుహాస్ (Suhas) హీరోగా నటిస్తున్న నూతన చిత్రం ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ (Ambajipeta Marriage Band). ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దుశ్యంత్ కటికినేని (Dushyanth Katikineni) దర్శకత్వంలో.. కామెడీ డ్రామా కథతో తెరకెక్కుతోన్న ఈ సినిమా త్వరలోనే థియేటర్స్‌లోకి రానుంది. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో టాలెంటెడ్ డైరెక్టర్స్ మారుతి, హను రాఘవపూడి, శైలేష్ కొలను, సాయి రాజేశ్, సందీప్ రాజ్, ప్రశాంత్, మెహర్, భరత్ కమ్మ నిర్మాత ఎస్కేఎన్ వంటి వారి సమక్షంలో ఈ చిత్ర టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. టీజర్ విడుదల అనంతరం.. (Ambajipeta Marriage Band Teaser Launch)

హీరో సుహాస్ (Suhas Speech) మాట్లాడుతూ.. ఈ సినిమా ఇంత బాగా రూపుదిద్దుకోవడానికి మా నిర్మాతలే కారణం. ధీరజ్‌గారు మాకు కావాల్సిన సపోర్ట్ ఇచ్చి ఎంకరేజ్ చేశారు. అలాగే ఇంత మంచి కథను నా దగ్గరకు తీసుకొచ్చిన దుశ్యంత్‌కు థ్యాంక్స్ చెబుతున్నా. లక్ష్మీ క్యారెక్టర్‌లో చాలా బాగా నటించింది నా కోస్టార్ శివానీ. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ఎడిటింగ్.. ఇలా ప్రతి డిపార్ట్‌మెంట్ ఔట్‌పుట్ సూపర్బ్‌గా ఇచ్చారు. నా డైరెక్టర్స్ నా కెరీర్‌ను ఒక్కో ఇటుక పేర్చి ఇళ్లులా తీర్చిదిద్దారు. మా ఊరిలో గృహప్రవేశం టైమ్‌లో కుంకుమ నీళ్లలో అరచేతిని అద్ది కొత్త ఇంటి గోడకు అచ్చు వేస్తారు. ఆ అచ్చు అలాగే చిరకాలం ఉండిపోతుంది. నా కెరీర్‌లో అలాంటి అచ్చు లాంటి సినిమా ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ అని అన్నారు.


AMB.jpg

చిత్ర దర్శకుడు దుశ్యంత్ కటికినేని మాట్లాడుతూ (Director Dushyant Katikineni Speech).. మా సినిమా టీజర్ విడుదలకు వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్స్. నాలాంటి ఒక కొత్త డైరెక్టర్‌కు జీఏ2 పిక్చర్స్‌లో మూవీ అవకాశం రావడం చాలా గొప్ప విషయం. నాకు ఈ అవకాశం ఇచ్చిన అల్లు అరవింద్‌గారికి, బన్నీ వాసుగారికి థ్యాంక్స్ చెబుతున్నా. ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ లాంటి మూవీకి ప్రొడ్యూసర్స్ సపోర్ట్ చాలా అవసరం. నాకు మా నిర్మాతలు అల్లు అరవింద్ (Allu Aravind), బన్నీ వాసు (Bunny Vas), ధీరజ్ (Dheeraj), వెంకటేష్ మహా (Venkatesh Maha) ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. మంచి సినిమా చేద్దామని ఎంకరేజ్ చేశారు. సుహాస్ నాకు మంచి ఫ్రెండ్. 2017లో మేమిద్దరం కలిసి ఒక షార్ట్ ఫిలిం చేద్దామని అనుకున్నాం కానీ కుదరలేదు. ఆ తర్వాత సుహాస్ హీరోగా నటించిన రెండు సినిమాలకు నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాను. ఆ టైమ్‌లో మేము కొన్ని కథలు అనుకున్నాం. ఖచ్చితంగా కలిసి సినిమా చేయాలని నిర్ణయించుకున్నాం. నేను ఈ మూవీ స్టోరీ లైన్‌ను ఫోన్‌లో చెప్పాను. టైటిల్, స్టోరీ లైన్ విని మనం సినిమా చేద్దాం అన్నారు సుహాస్. నాతో మూవీ చేసినందుకు సుహాస్‌కు థ్యాంక్స్ చెబుతున్నానని అన్నారు.


ఇవి కూడా చదవండి:

============================

*Fatima Vijay Antony: నీ జ్ఞాపకాలతో చచ్చిపోతున్నా!.. కుమార్తె మృతిపై భావోద్వేగ పోస్ట్

**********************************

*Priyamani: ఓటీటీలో దసరా స్పెషల్‌‌గా ప్రియమణి నటించిన పవర్‌ఫుల్ వెబ్ సిరీస్.. రిలీజ్ డేట్ ఫిక్స్

**********************************

*Raghava Lawrence: ఆడియో ఫంక్షన్లకు అభిమానులు రావొద్దు.. లారెన్స్ సంచలన వ్యాఖ్యలు

*******************************

*Lokesh Kanagaraj: ఆ డైలాగ్‌ వివాదానికి పూర్తి బాధ్యత నాదే!

*******************************

*Kangana Ranaut: నాకూ పెళ్లి చేసుకోవాలనే ఉంది.. కానీ?

******************************

Updated Date - 2023-10-10T14:37:39+05:30 IST