చిరుకి కాదు.. బాలయ్యకు విలన్‌గా మనోజ్!
ABN, Publish Date - May 20 , 2026 | 12:08 PM
రా కింగ్ మంచు మనోజ్ బర్త్‌డే నేడు (మే 20). ఈ సందర్భంగా ఆయన నటిస్తోన్న సినిమాల నుంచి వస్తోన్న ఒక్కో అప్డేట్.. సెన్సేషన్‌ని క్రియేట్ చేస్తోంది. తాజాగా బాలయ్య సినిమాలో ఆయన చేస్తున్నట్లుగా వచ్చిన అప్డేట్‌తో సోషల్ మీడియా షేకవుతోంది.
రా కింగ్ మంచు మనోజ్ (RawKing Manchu Manoj) బర్త్‌డే నేడు (మే 20). ఈ సందర్భంగా ఆయన నటిస్తోన్న సినిమాల నుంచి వస్తోన్న ఒక్కో అప్డేట్.. సెన్సేషన్‌ని క్రియేట్ చేస్తోంది. ఎప్పుడూ ప్రయోగాత్మక చిత్రాల్ని చేస్తూ, డిఫరెంట్ కంటెంట్‌తో సినిమాల్ని తీస్తూ.. ప్రేక్షకులను అలరించే మంచు మనోజ్.. ఇటీవల వచ్చిన ‘మిరాయ్’ (Mirai)తో విలన్‌గానూ తన సత్తా చాటారు. అలాగే ‘భైరవం’ (Bhairavam) అనే మూవీలో మరో ఇద్దరు హీరోలతో కలిసి నటించారు. ఇలా ఎప్పుడూ వైవిధ్యంగా ప్లాన్ చేసే మనోజ్‌కు సంబంధించి ఇప్పుడు సాలిడ్ అప్డేట్ వచ్చింది. నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) సినిమాలో మంచు మనోజ్ నటిస్తున్నారు.
అవును, ఈ విషయాన్ని స్వయంగా ‘NBK111’ టీమ్ అధికారికంగా ప్రకటించింది. మొన్నటి వరకు మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో రూపుదిద్దుకోనున్న ‘మెగా158’లో మంచు మనోజ్ విలన్‌గా చేస్తున్నాడనేలా వార్తలు వైరల్ అవుతూ వచ్చాయి. నిజమా! అని అంతా ఆశ్చర్యపోయారు. ఆ సినిమాలో మనోజ్ చేస్తున్నారో, లేదో తెలియదు కానీ.. నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని మూవీలో మాత్రం ఆయన చేస్తున్నట్లుగా క్లారిటీ వచ్చేసింది. ఈ మేరకు ‘NBK111’ టీమ్, మంచు మనోజ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. ఓ పోస్టర్ విడుదల చేసింది.
ఈ పోస్టర్‌తో మనోజ్ ఈ సినిమా చేస్తున్నాడనే విషయాన్ని అధికారికంగా మేకర్స్ ధృవీకరించారు. అయితే విలన్ రోలా? లేదంటే ఏదైనా సపోర్టింగ్ రోలా? అనేది మాత్రం టీమ్ క్లారిటీ ఇవ్వలేదు. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోన్న సమాచారం ప్రకారం, ‘మిరాయ్’ తరహాలో ఇందులో కూడా మనోజ్ నెగిటివ్ రోల్ ప్లే చేస్తున్నట్లుగా అయితే టాక్ నడుస్తోంది. మరి ఈ విషయంపై మేకర్స్ ఎప్పుడు అధికారిక ప్రకటన చేస్తారో తెలియదు కానీ, ఈ అప్డేట్‌తో సోషల్ మీడియా అంతా ఒక్కసారిగా అలెర్ట్ అయ్యింది. బాలయ్య సినిమాలో మనోజ్ అంటూ.. ఒకటే పోస్ట్‌లు. బాలయ్య ఫ్యామిలీకి, మంచు ఫ్యామిలీకి ఉన్న అనుబంధం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. మొత్తంగా అయితే, బర్త్‌డే రోజు మనోజ్.. అటు మంచు అభిమానులకు, ఇటు నందమూరి అభిమానులకు మంచి ట్రీట్ ఇచ్చారనే చెప్పుకోవాలి.
ఇవి కూడా చదవండి:
Peddi Movie: 24 గంటల్లో ‘పెద్ది’ ట్రైలర్ బీభత్సం.. హిస్టారికల్ రికార్డ్!
యంగ్ టైగర్‌కు పవర్ స్టార్ బర్త్‌డే విషెస్.. ట్వీట్ వైరల్!
యాక్షన్ కింగ్ అర్జున్ ‘బ్లాస్ట్’ చేసేది ఆ రోజే!
నాకు కాబోయే భర్త ఇండస్ట్రీ వ్యక్తి కాకూడదు: అనన్య నాగళ్ల