Manchu Manoj: మంచు మనోజ్‌ షెడ్యూల్‌ ఇదే..

ABN , Publish Date - May 19 , 2026 | 07:28 PM

బుధవారం(మే 20) రా కింగ్‌ స్టార్‌ మంచు మనోజ్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా విలేకర్లతో ఆయన భవిష్యత్తు కార్యచరణ, సినిమాల గురించి ముచ్చటించారు

బుధవారం(మే 20) రా కింగ్‌ స్టార్‌ మంచు మనోజ్‌ (Manchu Manoj) పుట్టినరోజు. ఈ సందర్భంగా విలేకర్లతో ఆయన భవిష్యత్తు కార్యచరణ, సినిమాల గురించి ముచ్చటించారు. జూన్‌ 7న ఆయన హీరోగా కొత్త సినిమా ‘రక్షక్‌’ (Rakshak) ప్రారంభం కానుంది. దీని గురించి మాట్లాడుతూ ‘ప్రస్తుతం మహిళలని ఎదుర్కొంటున్న సమస్యలు, మహిళా సాధికారత నేపథ్యంలో ‘రక్షక్‌’ చిత్రం ఉంటుంది. అందులో నేను డీసీపీగా పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రను పోషిస్తున్నాను. ఆ సినిమా ప్రారంభం రోజే ‘ఐక్య’కి సంబంధించిన అన్ని విషయాల్ని అధికారికంగా ప్రకటిస్తాను. అప్పటిలోపు పలువురి సలహాలు తీసుకుంటాను.

‘నాకు సినిమాల్లో మళ్లీ పునర్జన్మను ఇచ్చిన విజయ్‌ కనకమేడల, కార్తిక్‌ ఘట్టమనేనికి జీవితాంతం రుణపడి ఉంటాను. ప్రస్తుతం అన్ని రకాల క్యారెక్టర్స్‌ చేయాలనుకుంటున్నా. కెరీర్‌ బిగినింగ్‌ నుంచి ఇప్పటి వరకు ప్రతీ స్ర్కిప్ట్‌, కథని నేనే విని.. నేనే ఓకే చేశాను. ఇప్పుడు కూడా నేనే వింటాను. నాకు నచ్చిన కథల్నే చేస్తాను. నా వృత్తిపరమైన జీవితంలోకి నా భార్య గానీ, ఆమె వృత్తిపరమైన జీవితంలోకి నేను గానీ వెళ్లం. మేం పరస్పరం ఆ విషయంలో ఒకరినొకరిని గౌరవించుకుంటాం. మేం పుట్టినప్పటి నుంచీ రాజకీయాల్లోనే ఉన్నాం. కొత్తగా రాజకీయాల్లోకి రావడం అని ఏముంది. వచ్చే ఎన్నికల్లో నా భార్య పోటీ చేయనుంది.

దేవిడ్‌రెడ్డి గురించి ఇప్పుడే చెప్పేకంటే.. బుధవారం గ్లింప్స్‌ రాబోతోంది. మాటల కంటే మన పని చెబితేనే బెటర్‌. షూటింగ్‌ దాదాపు 40 శాతం పూర్తయింది. హనుమా రెడ్డి కాంప్రమైజ్‌ కాకుండా షూటింగ్‌ చేస్తున్నారు. మధ్య ప్రదేశ్‌లో ఈ మధ్య షూటింగ్‌ చేసి వచ్చాం. ‘వాట్‌ ది ఫిష్‌’ ఇప్పుడు రావడం లేదు. అనుకోని కారణాల వల్ల అది కుదరలేదు.

Updated Date - May 19 , 2026 | 07:36 PM