మన డాక్టర్ బాబు మంచి హిట్ కొడతాడు: అలీ
ABN, Publish Date - Nov 16 , 2026 | 09:42 PM
శరణ్య, సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్‌పై కృతాక్షి నిర్మాణంలో చలపతి కుమార్ పువ్వల దర్శకత్వం వహించిన చిత్రం ‘మన డాక్టర్ బాబే’. ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించారు.
శరణ్య, సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్‌పై కృతాక్షి నిర్మాణంలో చలపతి కుమార్ పువ్వల దర్శకత్వం వహించిన చిత్రం ‘మన డాక్టర్ బాబే’ (Mana Doctor Baabe). ఈ సినిమా ద్వారా శ్రీ స్కంద హీరోగా వెండితెరకు పరిచయమవుతున్నారు. మోహన సిద్ధి, శృతి శంకర్ హీరోయిన్లుగా నటించగా.. అలీ, రాజీవ్ కనకాల, శాంతి, కోటేశ్వరరావు కీలక పాత్రలు పోషించారు. నవంబర్ 20న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో, ఆదివారం చిత్ర బృందం ప్రీ-రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి యువ హీరో రాజ్ తరుణ్ ముఖ్య అతిథిగా హాజరై చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. “ఈ సినిమాతో హీరోగా, నిర్మాతగా పరిచయమవుతున్న శ్రీ స్కందకు ఆల్ ది బెస్ట్. మన తెలుగు అమ్మాయిలను హీరోయిన్లుగా చూస్తుండటం చాలా ఆనందంగా ఉంది. అలీ గారితో కలిసి నటించే అదృష్టం ఇంతవరకు రాకపోయినా, ఆయనతో ఇలా వేదిక పంచుకోవడం సంతోషంగా ఉంది. డైరెక్టర్ చలపతి గురించి హర్ష ఎప్పుడూ గొప్పగా చెబుతుంటారు. కిషోర్ అద్భుతమైన విజువల్స్ అందించారు. నవంబర్ 20న థియేటర్లలో విడుదలవుతున్న ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని పేర్కొన్నారు.
అలీ మాట్లాడుతూ.. “దర్శకుడు చలపతి మీద ఉన్న నమ్మకంతో శ్రీ స్కంద ఎంతో కష్టపడి, తన సొంత డబ్బులు పెట్టి ‘మన డాక్టర్ బాబే’ చిత్రాన్ని నిర్మించాడు. వీరిద్దరి కష్టాన్ని నేను దగ్గరుండి చూశాను. చిన్న సినిమానా, పెద్ద సినిమానా అనేది ప్రేక్షకులు ఎప్పుడూ పట్టించుకోరు. కథలో బలం, కంటెంట్ ఉంటే కచ్చితంగా ఆదరిస్తారు. నవంబర్ 20న వస్తున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు చూసి మంచి హిట్ చేస్తారని ఆశిస్తున్నాను. కచ్చితంగా మన డాక్టర్ బాబు కూడా ప్రేక్షకులని మెప్పిస్తాడు” అని అన్నారు. హీరో శ్రీ స్కంద మాట్లాడుతూ.. ఇప్పటికే ప్రీమియర్ షోలు చూసిన వారంతా సినిమా బాగుందని మెచ్చుకున్నారని, నవ్విస్తూనే మంచి సందేశం, భావోద్వేగాలతో దర్శకుడు చలపతి చిత్రాన్ని గొప్పగా తీర్చిదిద్దారని తెలిపారు. అలీతో కలిసి నటించడం తన అదృష్టమని, ప్రేక్షకులు పెట్టే ప్రతి రూపాయికి న్యాయం జరిగేలా సినిమా ఎంటర్టైన్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
దర్శకుడు చలపతి కుమార్ పువ్వల మాట్లాడుతూ.. శ్రీ స్కంద సహకారం, నిర్మాత కృతాక్షి రాజీపడని తత్వం వల్లే సినిమా ఇంత బాగా వచ్చిందన్నారు. ఈ చిత్రంలో అలీ కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని, రాజీవ్ కనకాల, శృతి శంకర్, మోహన సిద్ధి అద్భుతంగా నటించారని తెలిపారు. కార్యక్రమంలో హీరోయిన్లు శృతి శంకర్, మోహన సిద్ధి, ‘కూర్మావతారం’ దర్శకుడు హర్షవర్ధన్ తదితరులు పాల్గొని నవంబర్ 20న విడుదల కానున్న ‘మన డాక్టర్ బాబే’ చిత్రాన్ని ఆదరించాలని కోరారు.
ఇవి కూడా చదవండి:
నవ్విస్తూ, భయపెట్టేందుకు ‘భూతం ప్రేతం’ రెడీ..
మలేషియాలో గ్రాండ్‌గా మృణాళిని వివాహం.. పెళ్లి ఫోటోలు వైరల్
సోల్‌మేట్‌కు లిప్ కిస్.. ‘పులి’ పిల్ల పబ్లిగ్గా చేసిన రచ్చ చూశారా?