ఒకే వేడుకలో చైతూ-శోభిత, సమంత-రాజ్ జంటలు హల్చల్!
ABN , Publish Date - May 03 , 2026 | 03:33 PM
టాలీవుడ్ వేదికగా ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. విడాకులు తీసుకుని, వేరొకరిని పెళ్లి చేసుకున్న అక్కినేని నాగ చైతన్య, సమంతలు హైదరాబాద్‌లో జరిగిన ఓ మ్యారేజ్ రిసెప్షన్‌లో సందడి చేశారు.
టాలీవుడ్ (Tollywood) వేదికగా ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. విడాకులు తీసుకుని, వేరొకరిని పెళ్లి చేసుకున్న అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya), సమంత (Samantha)లు హైదరాబాద్‌లో జరిగిన ఓ మ్యారేజ్ రిసెప్షన్‌లో సందడి చేశారు. నాగ చైతన్య తన వైఫ్ శోభిత (Sobhita Dhulipala)తో హాజరవగా, ఫస్ట్ టైమ్ సమంత తన భర్త రాజ్ నిడిమోరు (Raj Nidimoru)తో ఈ వేడుకకు రావడం విశేషం. దీంతో, ఒకే వేడుకలో చైతూ-శోభిత, సమంత-రాజ్ జంటలు అంటూ సోషల్ మీడియా వేదికగా హడావుడి మొదలైంది. ఈ రెండు జంటలు వేడుకకు వస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు విషయం ఏమిటంటే..
టాలీవుడ్ నిర్మాత సునీల్ నారంగ్ కుమార్తె సిమ్రాన్ - క్రిష్‌ల వివాహం ఇటీవలే బెంగళూరులో వైభవంగా జరిగింది. శనివారం రాత్రి హైదరాబాద్‌లో ఘనంగా రిసెప్షన్‌ను నిర్వహించారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, నాగార్జున - అమల, రవితేజ, నాగచైతన్య - శోభిత, సమంత - రాజ్ నిడియోరు వంటి పలువురు సినీ ప్రముఖులు హాజరై కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఇప్పటి వరకు తన భర్త రాజ్‌ని టాలీవుడ్‌కి పరిచయం చేయని సమంత.. ఫస్ట్ టైమ్ ఈ వేడుకకు తన భర్తతో కలిసి హాజరవడంతో.. అంతా ఆమె గురించే మాట్లాడుకుంటున్నారు.
మరి ఈ రెండు జంటలు ఎదురెదురు పడినట్లుగా అయితే ఎక్కడ కనిపించలేదు కానీ, ఇలా ఈ వేడుకకు వారు హాజరవడమే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నిజంగా ఎదురెదురు పడి ఉంటే.. ఏం జరిగి ఉండేదో? అనేలా నెటిజన్లు ఆసక్తికరంగా రియాక్ట్ అవుతున్నారు. ప్రస్తుతం ‘విరూపాక్ష’ దర్శకుడైన కార్తీక్ దండు దర్శకత్వంలో నాగ చైతన్య ‘వృషకర్మ’ అనే మిథికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంతో వచ్చేందుకు సిద్ధమవుతుండగా, సమంత తన సొంత బ్యానర్‌లో ‘మా ఇంటి బంగారం’ అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీగా ఉన్నారు. ‘మా ఇంటి బంగారం’ చిత్రం నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకుని రిలీజ్ సన్నాహాల్లో ఉంది.
ఇవి కూడా చదవండి:
పవన్ కళ్యాణ్ నివాసానికి సీఎం చంద్రబాబు.. ఫొటోలు వైరల్!
‘నా పెళ్ళాం నిప్పు రా’.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోస్ట్ వైరల్!
తొక్కలో ఇంటర్వ్యూ.. అంటూ కుర్చీ విసిరేసి వెళ్లిపోయిన గెటప్ శ్రీను!
కయాదు లోహర్ గురించి ఈ విషయాలు తెలుసా?